హై అలర్ట్... అయోధ్యపై తీర్పు వచ్చేస్తోంది

హై అలర్ట్... అయోధ్యపై తీర్పు వచ్చేస్తోంది

యావద్ భారత దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అయోధ్య కేసులో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించనుంది. రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంగా పరిగణిస్తున్న ఈ కేసులో తుది తీర్పు వెలువరించేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. శనివారం ఉదయం 10:30 గంటలకు అయోధ్య భూ వివాదంపై ఐదుగురు న్యాయమూర్తుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పును వెలువరించనుంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ వివాదానికి ముగింపు పలకాలని సర్వత్రా వ్యక్తమవుతున్న భావనకు అనుగుణంగానే సుప్రీంకోర్టు కూడా ఈ వివాదానికి చెల్లుచీటి ఇవ్వనుంది.

అయోధ్య కేసు అంటేనే ఎక్కడ లేని హైటెన్షన్ పరిస్థితులు ఏర్పడుతున్న పరిస్థితి మనకు కొత్తేమీ కాదు. అలాంటిది ఈ వివాదంపై తుది తీర్పు అంటే ఇంకెంత హైటెన్షన్ అన్న దానిపై ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అందుకే శనివారం నుంచి దేశం మొత్తం హై అలర్ట్ గానే ఉండనుంది. అయోధ్యపై సుప్రీంకోర్టు ఇవ్వనున్న ఈ తీర్పు ఏ వర్గానికి అనుకూలంగా ఉన్నా... మరో వర్గం మాత్రం తీవ్ర స్థాయిలో ఆందోళనలకు దిగే అవకాశాలు లేకపోలేదు. దీంతోనే అయోధ్యపై తీర్పు రానున్న శనివారాన్ని మాత్రం హైఅలర్ట్ డేగానే పరిగణించాలి.

ఈ తరహా హై అలర్ట్ ను ఇప్పటికే ప్రకటించేసిన కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు... అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశంలో ఎ్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తత ప్రకటించింది. ముందస్తు జాగ్రత్తగా ఉత్తర ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. యూపీవ్యాప్తంగా 40 వేలకు పైగా సిబ్బంది మోహరించింది. అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైనదిగా భావిస్తోన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన తీర్పు వెలువడిన అనంతరం నెలకొనే పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.

కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కావడం వల్ల కేంద్రం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు గురువారంమే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా తీర్పుపై ఎవరూ వివాదస్పద రీతిలో బహిరంగ ప్రకటన చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు ఇదివరకే సూచించారు. ఈ మేరకు ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ప్రధాని తీర్పులో స్పందించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వినియోగదారులకు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇది వరకే స్పష్టమైన హెచ్చరికలు జారీచేసింది. తీర్పు వెలువడిన తరువాత దానికి వ్యతిరేకంగా, సానుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలను తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English