దారుణం.. చిత్తూరులో ఘోర ప్రమాదం.. 12 మంది దుర్మరణం

దారుణం.. చిత్తూరులో ఘోర ప్రమాదం.. 12 మంది దుర్మరణం

మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న దారుణ రోడ్డు ప్రమాదాలకు కొనసాగింపుగా దీన్ని చెప్పాలి. చిత్తూరు జిల్లాలో చోటు జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం పన్నెండు మందిని బలి తీసుకుంది. శుక్రవారం రాత్రి వేళలో చోటు చేసుకున్న ఈ ఘోరప్రమాదంలో ఘటనాస్థలంలోనే పన్నెండు మంది మరణించారు. వీరిలో ఎనిమిది మంది ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

బెంగళూరు - చిత్తూరు జాతీయ రహదారిపై మొగిలిఘాట్ వద్ద వాహనాలపై నీళ్ల సీసాలతో వెళుతున్న భారీ కంటైనర్ బోల్తా పడింది. బ్రేకులు ఫెయిల్ కావటంతో డివైడర్ ను దాటి ఆటో.. ఓమ్ని వ్యాన్.. టూవీలర్ వాహనం మీదకు కంటైనర్ దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించటం కష్టంగా మారింది. చీకటి పడటం.. ఆచూకీని గుర్తించే వివరాలు వారి దగ్గర లభించలేదన్నది ప్రాథమిక సమాచారం. ఇదిలా ఉంటే.. ఒకే కుటుంబానికి చెందిన 8 మందిని మాత్రం పోలీసులు గుర్తించారు.

గంగవరం మండలం మర్రిమాకులపల్లెకు చెందిన రెడ్డి శేఖర్ కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఓమ్నీ వాహనంలో తెట్టుగుండ్లపల్లికి వెళ్లారు. తమ బంధువుల్లో ఒకరు మరణించటంతో పరామర్శ కోసం వెళ్లి వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ దారుణ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ కూడా మరణించారు. కంటైనర్ క్లీనర్ పరిస్థితి విషమంగా ఉంది. భారీగా ఉన్న కంటైనర్ దూసుకెళ్లటంతో మృతదేహాలు గుర్తించలేనంతగా ఛిద్రమైనట్లు అధికారులు చెబుతున్నారు. సహాయచర్యల్ని అధికారులు వేగవంతం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English