ఇండియ‌న్ల‌కు ట్రంప్‌ ఫ్రెష్ షాక్ ఏంటంటే...

ఇండియ‌న్ల‌కు ట్రంప్‌ ఫ్రెష్ షాక్ ఏంటంటే...

విదేశీయుల‌ను ఉక్కిరిబిక్కిరి చేసేయ‌డం...ప్ర‌ధానంగా భార‌తీయుల‌ను టార్గెట్ చేయ‌డం అన్న‌ట్లుగా సాగుతున్న‌...అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రో షాకిచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి  ఇమిగ్రేషన్‌ విధానాల్లో మార్పులు తీసుకురావ‌డమే ల‌క్ష్యంగా ట్రంప్ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే H-1B వీసాల జారీ నిబంధనలను కఠినతరం చేసిన అమెరికా తాజాగా ఇంకో షాక్ ఇస్తూ..... దరఖాస్తు రుసుమును కూడా పెంచింది. అత్యంత ఆస‌క్తిక‌రంగా ఈ రుసుమును త‌మ దేశీయుల నైపుణ్య‌లు పెంచేందుకు ఉప‌యోగిస్తామ‌ని ప్ర‌క‌టించింది.

నైపుణ్య‌వంతులైన మాన‌వ వ‌న‌రుల‌ను త‌మ దేశానికి ఆహ్వానించేందుకు అమెరికా హెచ్‌1బీ వీసాల‌ను ఇస్తోంది.  H-1B వీసాపై అమెరికా వెళ్లేవారిలో ఎక్కువ మంది భారతీయులే ఉంటారు. ఇప్పుడు దరఖాస్తు ఫీజు పెంచితే.. ఐటీ కంపెనీలపై ఆర్థికంగా అదనపు భారం పడుతుంది. దీంతో అమెరికాకు ఉద్యోగులను పంపించే భారత ఐటీ కంపెనీలపై ఇక నుండి మ‌న దేశ‌స్తుల‌ను కాకుండా...అమెరిక‌న్ల‌కే ప్రాధాన్యం ఇవ్వ‌నున్నాయి. 2020 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన వార్షిక బడ్జెట్‌లో ఈ ప్రతిపాదనలు చేశారు. అయితే దరఖాస్తు రుసుమును ఎంత పెంచాలనుకుంటున్నారు.. ఏయే కేటగిరిలోని దరఖాస్తుదారులకు ఈ పెంపు వర్తిస్తుంది లాంటి పూర్తి వివరాలను అమెరికా వెల్ల‌డించ‌లేదు.

అమెరికా యువతకు సాంకేతిక అంశాల్లో ట్రైనింగ్ ఇచ్చే అప్రెంటిస్‌ ప్రొగ్రామ్‌కు నిధులను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ కార్మికశాఖ మంత్రి అలెగ్జాండర్‌ అకోస్టా తెలిపారు. స్థూలంగా విదేశాల నుంచి H-1B దరఖాస్తు రుసుము పేరుతో వ‌సూలు చేసిన సొమ్మును త‌మ పౌరుల కోసం అమెరికా వాడుకోనుంది. ఇందులో స‌హ‌జంగానే.... ఆ ప్రభావం ఎక్కువగా భారతీయ ఐటీ కంపెనీలపైనే పడనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English