వ‌రుస‌గా 7 ఫోర్లు... ఇదేం బౌలింగ్‌

వ‌రుస‌గా 7 ఫోర్లు... ఇదేం బౌలింగ్‌

బంగ్లాదేశ్‌తో జ‌రుగుతోన్న టీ 20 సీరిస్‌లో మెయిన్ బౌల‌ర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ గైర్హాజరీ నేప‌థ్యంలో చోటు ద‌క్కించుకున్న ఖ‌లీల్ అహ్మ‌ద్ ఘోరాతి ఘోరంగా విఫ‌ల‌మ‌వుతున్నాడు. టీ 20ల్లో వికెట్లు సాధించ‌డం ఎంత ముఖ్య‌మో... ప‌రుగులు నియంత్రించ‌డం కూడా అంతే ముఖ్యం. కానీ ఖ‌లీల్ పూర్తిగా ల‌య‌త‌ప్పి బంతులు వేస్తుండడంతో బంగ్లా బ్యాట్స్‌మెన్స్ మ‌నోడు బంతులు వేయ‌డ‌మే ఆల‌స్యం బౌండ‌రీల‌కు త‌ర‌లిస్తున్నారు.

ఖ‌లీల్‌ బౌలింగ్‌లో ఈజీగా ఫోర్లను కొడుతున్నారు ప్రత్యర్థి బంగ్లా ఆటగాళ్లు. బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకూ రెండు టీ20ల్లో రెండు వికెట్లు మాత్రమే తీసి 81 పరుగులిచ్చాడు. తొలి టీ20లో 37 పరుగులిచ్చిన అహ్మద్‌.. రెండో టీ20లో 44 పరుగులిచ్చాడు. ఈ రెండు మ్యాచ్‌ల‌లో అత‌డు వ‌రుస‌గా వేసిన 7 బంతుల‌ను బంగ్లా బౌల‌ర్లు బౌండ‌రీల‌కు త‌ర‌లించాడు.

ఢిల్లీ టీ20లో వ‌రుస‌గా నాలుగు బౌండరీలు ఇచ్చిన అహ్మద్‌.. రాజ్‌కోట్‌ టీ20లో బౌలింగ్‌కు వ‌చ్చిన వెంట‌నే వేసిన మూడు బంతుల్లోనూ బౌండ‌రీలు స‌మ‌ర్పించుకున్నాడు. దీంతో నెటిజ‌న్లు ఖ‌లీల్‌ను ఓ ఆటాడుకుంటున్నారు. ఇప్ప‌టికే రెండు టీ 20ల్లో అత్యంత చెత్త ప్ర‌ద‌ర్శ‌న చేసిన ఖ‌లీల్‌ను ఇంకా జ‌ట్టులో కొన‌సాగించ‌డం కంటే చెత్త ప‌ని మ‌రొక‌టి ఉండ‌ద‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

కొంద‌రు నెటిజ‌న్లు అయితే ఖ‌లీల్ నువ్వు బౌలింగ్ చేసే ముందు బుమ్రా ఎలా బౌలింగ్‌ చేస్తాడో గుర్తు తెచ్చుకో అని... ఖ‌లీల్ డాట్ బాల్ వేస్తే .. అదే వికెట్‌ తీసినంతగా సంబర పడతాం అని సెటైర్లు వేస్తున్నారు. ఇక కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఖ‌లీల్‌ను మూడో టీ 20లో కొన‌సాగించే సాహ‌సం చేస్తాడేమో ?  చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English