ఆ హీరో కెరీర్.. మూడు సినిమాల ముచ్చట

ఆ హీరో కెరీర్.. మూడు సినిమాల ముచ్చట

'ప్రేమతో మీ కార్తీక్' పేరుతో తెలుగులో ఓ సినిమా వచ్చిందన్న సంగతి చాలా మందికి తెలియదు. యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ ఈ చిత్రంతోనే హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు. ఐతే అజయ్ భూపతి తీసిన 'ఆర్ఎక్స్ 100' సినిమా సెన్సేషనల్ హిట్టవడంతో కార్తికేయకు ఎక్కడలేని పాపులారిటీ వచ్చింది.

ఈ సినిమా విజయం అంతా ప్రధానంగా దర్శకుడికే చెందుతుంది. ఆ తర్వాత హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు క్రెడిట్ ఇవ్వాలి. ఆ తర్వాతే కార్తికేయ వస్తాడు. కానీ 'అర్జున్ రెడ్డి' పాపులారిటీని మిగతా ఇద్దరి కంటే కార్తికేయే బాగా ఉపయోగించుకున్నాడు. హడావుడిగా రెండు మూడు సినిమాలు ఓకే చేసేశాడు. కానీ అతడి తొందరపాటు కెరీర్‌ను గట్టి దెబ్బే తీసింది.

అస్సలు చేయకూడని 'హిప్పీ' సినిమా చేయడం కార్తికేయ కెరీర్‌కు పెద్ద మైనస్ అయింది. ఆ సినిమాతో అతను గాలి తీసిన టైరులా అయిపోయాడు. ఆపై 'గుణ 365' అనే పర్వాలేదనిపించే సినిమా చేసినా అది జనాలకు రీచ్ కాలేదు. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. మధ్యలో 'గ్యాంగ్ లీడర్'లో విలన్ పాత్రతో మెరిసినా ఆ సినిమా కూడా అనుకున్నంతగా ఆడలేదు. కెరీర్‌కు ఉపయోగపడలేదు. ఇప్పుడు కార్తికేయ నుంచి '90 ఎంఎల్' అనే సినిమా రాబోతోంది.

జనాలకు చెడే ఎక్కువ ఎక్కుతుందనే ఉద్దేశంతో 'ఆర్ఎక్స్ 100' తరహాలో చెడు ఆలోచనల్ని ఎలివేట్ చేసే కథాంశంతో ఈ సినిమా తీశారు. కానీ అన్ని సినిమాలూ 'ఆర్ఎక్స్ 100'లు అయిపోవని చాటుతూ ఈ సినిమాకు ఆశించినంత బజ్ రాలేదు. ఎంతగా పబ్లిసిటీ చేస్తున్నా సినిమాకు హైప్ రావట్లేదు. బిజినెస్ ఆఫర్లు కూడా అనుకున్న స్థాయిలో రావట్లేదట. సినిమాకు అనుకున్న రేటు వచ్చాకే రిలీజ్ సంగతి తేలుద్దామని చూస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఏమైనా పరిస్థితి మారి సినిమాకు బజ్ వస్తుందేమో చూడాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English