చిరంజీవి కక్కుర్తి పడతాడా?

చిరంజీవి కక్కుర్తి పడతాడా?

రాజకీయాల్లోకి సేవ చేద్దామని వచ్చానని చిరంజీవి చెప్పాడు. కానీ తన పార్టీ ఓడిపోగానే వెంటనే దానిని కాంగ్రెస్‌లో విలీనం చేసేసి తాయిలాలు అంది పుచ్చుకున్నాడు. సిఎం కావాలనే ఆశతో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేసాడనేది ఎవరూ కాదనలేని నిజం. ఈజీగా సిఎం కుర్చీ ఎక్కేయవచ్చు అనుకున్న చిరంజీవికి రాజకీయాలు తెలియక ఖంగు తిన్నాడు. ఎన్నో మాటలు పడ్డాడు. చివరకు పోరాటం కూడా చేతకాని వాడినని అనిపించుకున్నాడు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం రెండు ముక్కలు కావడంలో చిరంజీవి తన పాత్ర పోషించాడు. అధిష్టానానికి కొమ్ము కాసి చాలా మంది ఆంధ్రులకి తీరని ఆగ్రహం తెప్పించాడు. ఇప్పటికీ తన పదవికి రాజీనామా చేయకుండా నాటకాలు ఆడుతున్నాడు.

కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడంతో సీఎం కుర్చీ ఖాళీ అయింది. దీంట్లో చిరంజీవిని కూర్చోపెడతారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు మరో రెండు నెలల్లో ఉన్నాయి. అంతవరకు సీఎంగిరీ వెలగబెట్టి ఆంధ్రప్రదేశ్‌కి సీఎం అయ్యా అనిపించుకుని సంతృప్తి పడిపోతాడా చిరంజీవి? నిజంగా ఈ రెండు నెలల పదవి కోసం చిరంజీవి కక్కుర్తి పడితే కనుక ఆంధ్ర రాష్ట్రం ముక్కలు కావడానికి ముఖ్య కారకుడిగా మిగిలిపోతాడు. చరిత్ర మర్చిపోలేని విధంగా తన మీద చెరిగిపోని మచ్చ వేయించుకుంటాడు. చిరంజీవి వీరాభిమానులు కూడా అతను ఇలా సీఎం అవకూడదని బలంగా కోరుకుంటున్నారు. మరి చిరంజీవి మైండ్‌లో ఎలాంటి ఆలోచనలు తిరుగుతున్నాయో?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English