బిజేపి ట్విస్టు – ఎవరికి బెస్టు

బిజేపి ట్విస్టు – ఎవరికి బెస్టు

బిజేపి రాజ్యసభలో ఇచ్చిన ట్విస్టు ఎవరికి బెస్టు అన్న చర్చ జోరుగా జరుగుతోంది. తెలంగాణ బిల్లు విషయంలో బిజేపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఆఖరునిముషంలో చేసిన హడావిడి, ఆయన పోరాటం దేనికోసం అన్న ప్రశ్నలు రాజకీయవర్గాల్లో తలెత్తయ్యాయి. ఓ వైపు లోక్ సభలో మద్దతిచ్చి, 34 సవరణలు ప్రతిపాదించి ఆమోదింప చేసుకున్నాక రాజ్యసభలో వెంకయ్యనాయుడు మరో 24 సవరణలు కోరడంతో ఒక్కసారిగా రాజకీయం  వేడెక్కింది. కారణం దీనిలో రాజ్యాంగ సవరణ అవసరమయ్యే సవరణలు ఉండడమే. అది సాధ్యమే అయినా తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి మరింత సమయం పడుతుంది. ఈ లోపు ఎన్నికలు, తర్వాత కొత్త ప్రభుత్వం రావడం అంటే కనీసం ఆరునెలల సమయం పడుతుంది.

లోక్ సభలో ఆమోదం పొందిన బిల్లు ఆరునెలల్లో ఆమోదం పొందక పోతే అది కాలం చెల్లుతుంది. అంటే తెలంగాణ కథ మళ్లీ  మొదటికి వస్తుంది. ఇలా తెలంగాణను అడ్డుకునే వ్యూహం బిజేపి వేసిందా.... అన్న అనుమానాలు వచ్చినా అది కాకపోవచ్చేమో అన్న సందేహాలు కూడా కలిగాయి. ఇలా మరోసారి సీమాంద్రవైపు పోరాడి బిజేపి సీమాంద్రలో కాస్తా బలం పుంజుకోవడానికి బిజేపి వేసిన వ్యూహం కూడా కావచ్చన్న అభిప్రాయం అందరిలో కలిగింది. పైగా సీమాంద్ర నుంచి లోక్ సభలో బిజేపికి ఒక్క సభ్యుడు కూడా లేరు.

ఇక రాజ్యసభలో ఉన్న ఏకైక సీమాంద్ర సభ్యుడు వెంకయ్య సీమాంద్రకోసం పోరాడకపోతే తన ప్రాంతంలో తనపై వ్యతిరేకత వస్తుందని ఇలా కొత్తగా మెలికలు పెట్టారా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో కలిగాయి. సరే తెలంగాణ అడ్డు కోవడమా, లేక సీమాంద్రలో భాగుపడడమా... అన్నదానిలో బిజేపి ఆలోచన ఏదైనా నిజంగా ఈ వ్యవహారం వల్ల బిజేపికి లాభం ఎంత అన్నది అసలు ప్రశ్న.

కారణం బిజేపికి సీమాంద్రలో ఇప్పటి వరకు అసలు బలమే లేదు. ఉన్నదంతా తెలంగాణలోనే. ఇప్పటికే చివరి నిముషంలో అనేక మెలికలు పెట్టి తెలంగాణలో కాస్తా దెబ్బతింది. దానిని తిరిగి పొందేందుకు సుష్మా స్వరాజ్ బిల్లుకు మద్దుతు తెలుపుతూ తెలంగాణ ఏర్పాటులో ఈ చిన్నమ్మ కూడా ఉందని చెప్పాలంటూ వాఖ్యలు చేసి కాస్తా మేకప్ చేసింది. అలాంటిది వెంకయ్యనాయుడు మళ్లీ ఇలా వ్యవహరించడం బిజేపికి తెలంగాణలో నష్టమే అంటున్నారు. ఇంత చేసి బిల్లుకు ఆమోదం తెలిపారనుకో అప్పుడు బిజేపి చివరి వరకు అడ్డుకునేందుకు ప్రయత్నించినా కూడా కాంగ్రెస్ కష్టపడి పాస్ చేయించిందన్న అభిప్రాయం కలిగి ఓ విధంగా కాంగ్రెస్ కే లాభం జరుగుతుంది అన్న వాదన వినిపిస్తోంది. అయితే సీమాంద్రలో కాస్తా ఫేవర్ సంపాదించి, టిడిపితో పొత్తుకు మార్గం సుగమం చేసుకోవాలన్నఆలోచన కూడా వెంకయ్య ఆఖరిపోరాటం వెనుక అసలు కథ అని కూడా అంటున్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English