తెలంగాణ సాధన క్రెడిట్ ఎవరి ఖాతాలో

తెలంగాణ సాధన క్రెడిట్ ఎవరి ఖాతాలో

తెలంగాణ సాధించిన ఘనత ఎవరి ఖాతాలో పడుతుంది అన్నది ఇప్పుడు అందరినోట నానుతున్న మాట. అయితే అందరినోట అతి సహజంగా వినిపించే మాట  ఈ విషయంలో గెలుపెవరిది. అయితే విజయోత్సవ సంబరాలు జరుపుకువంటున్న టిఆర్ఎస్ ది, తెలంగాణ కోసమే ప్రత్యేక పార్టీని ఏర్పాటు  ఎన్నో ఉద్యమాలు చేసిన కేసిఆర్ దే. ఆయన పార్టీ పెట్టి ఇంత చేయకుంటే పరిస్తితి ఇక్కడి దాకా వచ్చేది కాదు అన్న అభిప్రాయం సహజంగా అందరికి కలగడం పరిపాటే. కాని లోక్ సభలో తెలంగాణ బిల్లు పాస్ కావడానికి మాత్రం కారణమెవరు, ఈ విజయం ఎవరిది అంటే మాత్రం వినిపించేది కాంగ్రెస్, బిజేపిల మాటే. ఈ రెండు పార్టీలలో ఈ విజయం ఎవరిది అన్నది అసలు ప్రశ్న.

అయితే మొదటి నుంచి తెలంగాణకు మేము అనుకూలం, కాంగ్రెస్  ఎప్పుడు బిల్లుపెట్టినా కూడా తాము మద్దతిస్తాం అన్న బిజేపిదా అన్నది కూడా పరిగణలోకి తీసుకోవాలి. నిజమే అది ముందు నుంచి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందా సరే, లేకుంటే మేం అధికారంలోకి రాగానే ఇస్తాం అంది కాబట్టి బిజేపికి భయపడి కాంగ్రెస్ తెలంగాణ ఇప్పుడు ప్రకటించింది లేకుంటే తొమ్మిదేళ్లుగా ఇవ్వని తెలంగాణ ఇప్పుడెందుకిచ్చింది అందుకే ఈ విజయం బిజేపితే అంటారంటావా. పైగా తెలంగాణ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ కు సభలో బలం లేదు, ఆ విషయం కాంగ్రెసే చెప్పింది అంతే కాదు ఇప్పుడు బిజేపి మద్దతిచ్చింది కాబట్టే బిల్లు పాసయింది కాబట్టి గెలుపు బిజేపి పార్టీదే అంటారా....

సరే ఈ వాదనను కాదనలేం, కాని బిల్లు లోక్ సభకు వచ్చిన తర్వాత బిజేపి తన మాట మార్చింది. మొన్నటి వరకు తెలంగాణకు అనుకూలం అన్నప్పుడు గుర్తుకు రాని సీమాంద్రుల ప్రయోజనాలను తెరపైకి తెచ్చింది. అంతే కాదు అవి పూర్తి చేయకుంటే మద్దతివ్వం అంటూ ప్రకటించింది. వెంకయ్యనాయుడు, మోడి, అధ్వాని, సుష్మాస్వరాజ్ వంటి వారు కూడా ఈ రోజు ఉదయం వరకు అదే మాట చెప్పారు. దీంతో తెలంగాణ బిల్లు ఆమోదంపై సర్వత్రా టెన్షన్ క్రియేట్ అయింది. అంతే కాదు టిడిపితో పొత్తు అంటూ చంద్రబాబుతో బిజేపి అగ్రనేతలు కలుస్తూ నానా హంగామా చేసారు. చివరకు బిజేపి మద్దతివ్వకపోయినా సరే బిల్లును పాస్ చేయిస్తాం అంటూ కాంగ్రెస్ హెచ్చరించడమే కాదు, అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసింది. దీంతో తమకు ఎక్కడ నష్టం జరుగుతుందో, తెలంగాణలో తాము ఎక్కడ శాశ్వతంగా స్థానం కోల్పోతామో అన్న భయంతోనే మద్దతిచ్చింది. ఇంత చేసాక ఊరుకుంటే బాగుండేది, చివరికి రాజ్యసభలో మళ్లీ మెలికపెట్టింది. దీంతో బిజేపి పరిస్థితి మరింత పలుచనయింది. కాబట్టి ఈ విజయం కాంగ్రెస్ దే అనే మాట కూడా మెజారిటి వర్గాల్లో వినిపిస్తోంది. అంతే కాదు తెలంగాణ విషయంలో తమ సొంత పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు, నేతలు పార్టీని వీడినా, సీమాంద్రలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైనా కూడా ఇచ్చిన మాట కాంగ్రెస్ నిలబెట్టుకుంది కాబట్టి దానిదే విజయం అన్న టాక్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. కారణం బిజేపి చివరి నిముషంలో ఇలా అవాంతరాలు కల్పించినట్టుగా డ్రామాలాడకుంటే క్రెడిట్ పూర్తిగా బిజేపికి దక్కేదని, అలా చేయకపోవడం వల్లే ఇదంతా కాంగ్రెస్ కు ప్లస్ అయిందన్నది కూడా రాజకీయవర్గాల వాదన.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English