‘బిగ్ బాస్-3 ఫైనల్’ కన్నా.. ‘సూట్ కేస్ రెడ్డి’ టాప్

‘బిగ్ బాస్-3 ఫైనల్’ కన్నా.. ‘సూట్ కేస్ రెడ్డి’ టాప్

ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ‘బిగ్ బాస్’ అనేది సీజన్ నడిచినన్నాళ్లూ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పడూ ఒక హాట్ టాపిక్కే. అసలు షో చూడని వాళ్లు కూడా దీని గురించి మాట్లాడతారు. అప్ డేట్స్ తెలుసుకుంటూ ఉంటారు. అందులోనూ ఫైనల్ రోజు ఇది ఎంతగా చర్చనీయాంశం అయి ఉంటుందో చెప్పేదేముంది? కానీ ఇలాంటి హాట్ టాపిక్‌ను దాటి ఒక అంశం నిన్న ట్విట్టర్లో చర్చనీయాంశంగా మారింది.

#bigboss3grandfinale అనే హ్యాష్ ట్యాగ్‌ను మించి ఒక వ్యక్తి మీద వేసిన సెటైరిక్ హ్యాష్ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అయింది. ఆ హ్యాష్ ట్యాగ్.. #suitcasevijaysaireddy. ఇది ఎవరిని టార్గెట్ చేస్తూ పెట్టి హ్యాష్ ట్యాగ్ అన్నది ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత విజయ్ సాయిరెడ్డిని జనసైనికులు లక్ష్యంగా చేసుకుని ఈ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు.

నిన్న సాయంత్రమే ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టడానికి కారణాలు లేకపోలేదు. ఏపీలో ఇసుక సంక్షోభం మీద వైజాగ్‌లో జనసేన లాంగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ర్యాలీ అయ్యాక మాట్లాడుతూ.. పవన్ తనపై తరచుగా తీవ్ర వ్యాఖ్యలు, విమర్శలు చేసే విజయ్ సాయిరెడ్డి పేరెత్తాడు. సూట్ కేస్ కంపెనీలు పెట్టి అవినీతి సొమ్ము తిని జైల్లో గడిపి వచ్చిన విజయ్ సాయిరెడ్డికి తనను విమర్శించే అర్హత ఉందా అని పవన్ నిలదీశాడు.

విజయ్ సాయిరెడ్డి తన ఎంపీ హోదాను కూడా పట్టించుకోకుండా ట్విట్టర్లో ప్రత్యర్థులపై మరీ చీప్ కామెంట్లు చేస్తారన్న సంగతి తెలిసిందే. అందులోనూ పవన్‌ను ఎన్నోసార్లు తీవ్రంగా విమర్శించారు. దీంతో ఆయనపై జనసైనికులకు చాలా కోపం ఉంది. వాళ్ల ఆగ్రహానికి తగ్గట్లే పవన్ విజయ్ సాయిని టార్గెట్ చేయడంతో ఈ ‘సూట్ కేస్’ పదం పట్టుకున్నారు. దాని మీద హ్యాష్ ట్యాగ్ పెట్టి విజయ్ సాయిని ఏసుకోవడం మొదలుపెట్టారు. దీని మీద కుప్పలు కుప్పలుగా మీమ్స్ వచ్చి పడ్డాయి. ఈ హ్యాష్ ట్యాగ్ ఇండియా లెవెల్లో టాప్‌లో ట్రెండ్ అయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English