భాజపా కొత్త నాటకం

భాజపా కొత్త నాటకం

లోక్ సభలో విభజన బిల్లు వ్యవహారం అంటించిన మురికిని ఎలా వదుల్చుకోవాలా అని చూస్తోంది భాజపా. అందుకే రాజ్యసభకు బిల్లు వచ్చేసరికి మళ్లీ కొత్త నాటకానికి తెరతీసింది. సీమాంధ్రపై ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తోంది. ఏకంగా పది వేల కోట్లు ( సీమాంధ్ర నష్టానికి ఈ మొత్తం ఏ మేరకు?) ప్యాకేజీ ఇవ్వమని పట్టుపడుతోంది. దీనికి తోడు చిన్న చిన్న సాదా సీదా సవరణల ప్రతిపాదించి, పాప పరిహారం చేసుకోవాలని చూస్తోంది. ఇదిలా వుంటే వారి నటనకు తీసిపోకుండా సోనియా గాంధీ కూడా నటించేస్తోంది. సీమాంధ్రకు సరియైన ఆర్థిక ప్యాకేజీ ఇవ్వమని ప్రధానిని కోరిందట. ఇది మరీ చిత్రం. ఇన్నాళ్లు వ్వవహారం అంతా ఆమె చుట్టూనే తిరిగితే, ఇప్పుడు ఈ మాట చెప్పడం అంటే ఏమనుకోవాలి?

ఇదిలా వుంటే కాంగ్రెస్ ను దుమ్తెత్తి పోస్తున్న తెలుగుదేశం పార్టీ భాజపాను పల్లెత్తు మాట అనడం లేదు. అమ్ ఆద్మీ అధ్యక్షుడు కేజ్రీవాల్ మాత్రం భాజపా పోయి పోయి కాంగ్రెస్ తో కుమ్మక్కయిందని విమర్శించారు. మరోపక్క ఇంటర్ నెట్ లోనూ సామాజిక వెబ్ సైట్లలోనూ భారతీయ జనతా పార్టీపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. మోడీని దృష్టిలో పెట్టుకుని నిన్నటి వరకు భాజపాను నెత్తిన పెట్టుకున్న యువతరమే, ఇప్పుడు ఛీ కొడుతోంది. దీన్ని గమనించిన ఇప్పుడు భాజపా తప్పులు  సరిదిద్దుకోవడానికి సవరణల పేరిట కొత్త నాటకానికి తెరతీసినట్లు కనిపిస్తోంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English