జగన్ కూడా పప్పేనా? వైరల్ అవుతున్న బుద్ధా వెంకన్న ట్వీట్

జగన్ కూడా పప్పేనా? వైరల్ అవుతున్న బుద్ధా వెంకన్న ట్వీట్

గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నారా లోకేశ్ తన తెలుగు భాషతో ఎంత హాస్యం కురిపించేవారో.. ఆయన్ను విమర్శకులు ఎంతలా కామెడీ చేసేవారో తెలిసిందే. లోకేశ్‌కు పప్పు అనే ట్యాగ్ కూడా తగిలించి వైసీసీ నేతలు కామెడీ చేసేవారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో సాక్షాత్తు సీఎం జగన్ కూడా పప్పేనన్నట్లుగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తాజాగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

నవంబరు 1న రాష్ట్రావతరణ సందర్భంగా జగన్ చేసిన ప్రసంగం తప్పుల తడకగా ఉండడం.. ఆయన అనేక పదాలు పలకలేకపోవడంపై వెంకన్న ఆ వీడియోను ట్వీట్ చేశారు.
ప్రసంగ పాఠాన్ని చదువుతూ పలు పదాలను ఆయన తప్పులతడకగా ఉచ్ఛరించారు. ఆ వీడియోను షేర్ చేసిన బుద్ధా వెంకన్న అందులో పదాలకు అర్థాలు చెప్పాలంటూ వైసీసీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని అడిగారు.

''నిరా రక్షత' అంటే నిరక్షరాస్యత, 'దీవితాన్ని పణంగా' అంటే జీవితాన్ని పణంగా, 'సంఘ సస్కర్తలు' అంటే సంఘ సంస్కర్తలు కాబోలు. ఆ 'రాజిక సౌద్దన్నాన్ని' అనేది మాత్రం అర్థం కాలేదు. మీకు అర్థమయితే చెప్పండి వీసారెడ్డి గారూ' అంటూ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు.

మీ ముఖ్యమంత్రి జగన్ హీరోయిన్ల పేర్లు చదువుతున్నారేంటి? ఓహో... నిరక్షరాస్యతకు వచ్చిన పాట్లా ఇవి అంటూ వెంకన్న సెటైర్ వేశారు. చూడకుండా ప్రసంగించే వ్యక్తి తప్పు మాట్లాడినప్పుడు 'పప్పు' అంటూ మీరు సంబరపడ్డారని... చూసి కూడా చదవలేనివాడిని ఏమంటారు విజయసాయిరెడ్డిగారూ... ముద్దపప్పు అనే కదా అంటారు అంటూ ట్విటర్ సాక్షిగా కౌంటర్లేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English