కామ్రేడ్ రాఘవులు లెక్కలు మర్చిపోతున్నారా..

కామ్రేడ్ రాఘవులు లెక్కలు మర్చిపోతున్నారా..

 సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అంటే అందరికీ అదో అభిమానం. తోటి కామ్రేడ్ నారాయణ మాదిరి అవాకులుచవాకలు పేలుతూ.. నోటికి ఎప్పుడూ పని చెబుతుండరు. ఒకవేళ మాట్లాడితే.. అంతో ఇంతో విషయం ఉండేలా చూసుకుంటారు. స్వతహాగా మేధావి అయిన ఆయన అన్ని రకాల పుస్తకాల్ని విపరీతంగా చదివేస్తుంటారు. చివరకు ఆయన కూర్చునే ఆఫీసు గది మొత్తం కూడా పుస్తకాలతో నిండిపోయి ఉంటుంది.

 అంత మేధావి ఏదైనా విషయం మీద మాట్లాడితే ఏదో ఒక పాయింట్ తప్పక ఉంటుంది. మరి.. అలాంటి ఆయన.. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబునాయుడు కిరణ్ సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ డిమాండ్ చేశారు. మొన్నీ మధ్యనే టీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెట్టటం.. అది కాస్త వీగిపోవటం తెలిసిందే.

 ఒక అవిశ్వాస తీర్మానానికి మరో దానికి మధ్య ఆరునెలల వ్యవధి ఉంటుంది. ఈ లెక్కన త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాసం పెట్టే వీలు సాంకేతికంగా లేదు. అలాంటప్పుడు చంద్రబాబునాయుడు అవిశ్వాస తీర్మానం పెట్టాలనటంలో ఎలాంటి అర్థం లేదు. కేవలం జనాల్ని పక్కదోవ పట్టించటం తప్పించి... మరే ప్రయోజనం ఉండదు.  అవకాశం లేని సందర్భంలోనూ.. అలా తప్పులు మాట్లాడటం మరెవరో రాజకీయ నాయకుడు అంటే అర్థం చేసుకోవచ్చు. .. అన్నీ తెలిసిన రాఘవులు బాబాయ్ ఎందుకలా మాట్లాడి ఉంటారు చెప్మా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు