రేవంత్ టార్గెట్‌గా టీ కాంగ్రెస్‌లో కుట్ర‌...?

రేవంత్ టార్గెట్‌గా టీ కాంగ్రెస్‌లో కుట్ర‌...?

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు ఎంత దీన స్థితికి దిగజారిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి గెలిచే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్స్‌తో పాటు... రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

పిసిసి అధ్యక్షుడు రాజీనామా చేసిన స్థానంలో తన భార్యనే నిలబెట్టి గెలిపించుకోలేని ఘోరమైన స్థితికి కాంగ్రెస్ పడిపోయింది. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండాల్సి రావడంతో వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ అక్కడ పుంజుకుంటుందా ? అంటే ఆ స్కోప్‌ ఎంత మాత్రం కనపడటం లేదు. మరోవైపు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిజెపి చాపకింద నీరులా దూసుకుపోతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో కాస్తోకూస్తో పేరున్న నాయకులు తమలో తాము కలహించుకుంటూ పార్టీ పరువును బజారు కీడుస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌లో ప్రగతి భవన్ ముట్టడి పెద్ద సమస్యగా మారినట్లు తెలుస్తోంది. తమకు సమాచారం ఇవ్వకుండానే ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు ఇవ్వడంపై సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం రేవంత్ రెడ్డి టీఆర్ఎస్‌తో పాటు కేసీఆర్‌పై దూకుడుగా ముందుకు వెళుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కాస్తోకూస్తో ఆకర్షణ ఉన్న రాజకీయ నేతగా రేవంత్‌కు పేరు ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ పార్టీ తరపున కాకుండా... సొంత క్రేజ్ కోసం పాకులాడుతున్నారని టీ కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉంటున్నారు.

సీఎల్పీ కార్యాల‌యంలో భ‌ట్టి విక్ర‌మార్క‌, సంప‌త్‌ కుమార్‌, హ‌నుమంత‌రావు, మ‌ధుయాష్కీ, కోదండ‌రెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు. కాంగ్రెస్‌లో తాజా ప‌రిణామాల‌పై చ‌ర్చించారు. రేవంత్‌కు వ్య‌తిరేకంగా వీళ్లంగా గ‌ళ‌మెత్తారు. ఇక ప‌రిణామాలు చూస్తుంటే టీ కాంగ్రెస్‌లో మ‌ళ్లీ వ‌ర్గ విభేదాలు తెర‌పైకి వ‌చ్చాయ‌నే స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇక రేవంత్‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పుతోన్న ఈ నేత‌లు హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారానికి తూతూ మంత్రంగా ఒక రోజు వెళ్లి మ‌మ అనిపించేశారు.

మ‌రోవైపు ఇటు ప్ర‌గ‌తిభ‌వ‌న్ ముట్ట‌డితో ఒక్క‌సారిగా హైలెట్ అయిన రేవంత్ అటు రెండు రోజులు హుజూర్‌న‌గ‌ర్‌లో రోడ్ షోలు నిర్వ‌హించారు. ఆయ‌న షోల‌కు మంచి స్పంద‌న ల‌భించింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు హైలెట్ అయ్యే ప‌రిస్థితి లేదు. ఒక్క రేవంత్ మాత్ర‌మే అధికార పార్టీ నేత‌లంద‌రికి స‌మాధానం ఇస్తూ మీడియాలో బాగా హైలెట్ అవుతున్నాడు.

ఇదే టీ కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కు కూడా న‌చ్చ‌డం లేద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే రేవంత్ ఇమేజ్‌కు డ్యామేజీ ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నంలోనే సీనియ‌ర్ నేత‌లు ట్రై చేస్తున్నార‌న్న‌ది రేవంత్ వ‌ర్గం ఆరోప‌ణ‌. ఏదేమైనా పార్టీ ఘోరంగా దిగ‌జారి.. మూడో ప్లేస్‌లోకి ప‌డిపోతున్నా టీ కాంగ్రెస్ నాయ‌కులు ఇంకా ఎప్ప‌ట‌కి మార‌తారో ?  అర్థం కావ‌డం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English