భాజపా పై రాళ్లేస్తున్న దేశం

భాజపా పై రాళ్లేస్తున్న దేశం

ఇప్పుడు అందరికీ కళ్లు తెరుచుకుంటున్నాయి. నిన్నటి వరకు ఏదో అండగా వుంటుందనుకున్న భాజపా చివరి క్షణంలో కాంగ్రెస్ తో మిలాఖత్ అయిన తీరు చూసిన తరువాత సీమాంధ్ర నాయకులకు దిమ్మ తిరిగిపోయింది. ఇప్పడు భాజపాపై, మఖ్యంగా సుష్మ స్వరాజ్ పై తిట్ల దండకం అందుకుంటున్నారు. ఈ వరసలో తెలుగుదేశం ఎంపీ సిఎమ్ రమేష్ ముందున్నారు.

ముగ్గరు మహిళలు సోనియా, మీరాకుమార్, సుష్మస్వరాజ్ కలిసి సీమాంధ్రను ముంచారని ఆయన విమర్శిస్తున్నారు. రాహుల్, సోనియా సీమాంధ్రలో తిరగలేరని చెప్పిన మోడీ, ఇప్పుడు సుష్మ సీమాంధ్రలో తిరగగలరేమో చెప్పాలని ఆయన ఎద్దేవా చేసారు. అంతా బాగానే వుంది. మరి సీమాంధ్రకు ఇంత ద్రోహం చేసిన భాజపాతో పొత్తు పెట్టుకోము అని మాత్రం చెప్పరేమి రమేషూ?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English