బ‌యోపిక్‌లో ప‌వ‌న్‌.. జ‌గ్గారెడ్డి ధీమా

బ‌యోపిక్‌లో ప‌వ‌న్‌.. జ‌గ్గారెడ్డి ధీమా

జ‌న‌సేన పార్టీ అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌...మ‌ళ్లీ తెరంగేట్రం చేయ‌నున్నారా? రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న ఆయ‌న ఎప్ప‌టికైనా బ‌యోపిక్‌లో న‌టించే అవ‌కాశం ఉంద‌ట‌. అది కూడా త‌న బ‌యోపిక్‌లో న‌టిస్తార‌ని అంటున్నారు...కాంగ్రెస్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే అయిన తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియ‌స్ జ‌గ్గారెడ్డి.

స‌లు పేరు కంటే మారుపేరుతోనే.. సుప‌రిచితుడు అయిన ఈ నేత తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ...త‌న రాజ‌కీయాల గురించి, వ్య‌క్తిగ‌త జీవితం గురించి వెల్ల‌డిస్తూ...బ‌యోపిక్ ముచ్చ‌ట చెప్పుకొచ్చారు. త‌న బ‌యోపిక్‌ను ప్లాన్ చేస్తున్నాన‌ని పేర్కొన్న ఆయ‌న‌...ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను న‌టించేలా ఒప్పించేలా ప్ర‌య‌త్నం చేస్తాన‌న్నారు.

ఫైర్‌బ్రాండ్ నేత‌గా సుప‌రిచితుడు అయిన జ‌గ్గారెడ్డి ఒకప్పుడు కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన జగ్గారెడ్డి ఇటీవ‌ల వ‌రుస‌గా పొగడ్తల్లో ముంచెత్తారు. దీంతో మ‌రి కొద్దిమంది ఎమ్మెల్యేలతో క‌లిసి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్ప‌నున్నార‌ని, టీఆర్ఎస్‌లో చేర‌నున్నార‌ని ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ఆ చ‌ర్చ కొద్దికాలం త‌ర్వాత‌ ఆగిపోయింది.

క‌ట్ చేస్తే..తాజాగా ఓ మీడియా సంస్థ‌తో జ‌గ్గారెడ్డి మాట్లాడుతూ...టీఆర్ఎస్‌లో చేర‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింద‌ని...అయితే పార్టీ మార‌వ‌ద్ద‌ని త‌న కూతురు సల‌హా ఇవ్వ‌డంతో ఆగిపోయాన‌ని వెల్ల‌డించారు. ఎప్ప‌టికైనా పార్టీ మారుతారా అనే ప్ర‌శ్న‌పై స్పందిస్తూ...త‌న‌ను కేసీఆర్ స్వ‌యంగా పిలిచి అడిగితే...అప్పుడు స్పందిస్తాన‌ని తెలిపారు.

గ‌తంలో హ‌రీశ్‌రావుపై విమ‌ర్శ‌లు చేసిన మీరు ఆయ‌న మంత్రిగా మారిన త‌ర్వాత ఎందుకు స్టాండ్ మార్చ‌ర‌ని ప్ర‌శ్నించ‌గా...తమ జిల్లా మంత్రిగా ఉన్నారు కాబ‌ట్టే ఆయ‌న‌తో సానుకూలంగా మాట్లాడుతున్నాన‌ని తెలిపారు. మీకు వ్య‌క్తిగ‌తంగా అప్పులున్నా...రాజ‌కీయంగా ఎలా ముందుకు సాగుతున్నార‌ని ప్ర‌శ్నించ‌గా...నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోస‌మే అప్పులు చేస్తున్నాన‌ని వివ‌రించారు.

త‌న జీవితాన్ని బ‌యోపిక్‌గా తీసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇందులో త‌న పాత్ర పోషించాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను కోరుతాన‌ని...ఆయ‌న అంగీక‌రిస్తార‌నే న‌మ్మ‌కం త‌న‌కుంద‌ని జ‌గ్గారెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English