ముగ్గురు కాదు ముంచింది ఆరుగురు

ముగ్గురు కాదు ముంచింది ఆరుగురు

ముగ్గరు మహిళలు కలిసి ముంచారని సీమాంధ్ర రాజకీయ నాయకులు ఇప్పుడు వాపోతున్నారు. కానీ ఆ మాటకు వస్తే ముగ్గురు కాదు ఆరుగురు కలిసి ముంచారు. విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన చంద్రబాబు, జగన్, విభజన వ్యవహారాన్ని తన తొండి ఆటతో నడిపించిన కిరణ్ కుమార్ రెడ్డిని ఎలా మర్చిపోతారు. విభజన వద్దు అని తెలిసిన తరువాత జగన్ ముందుగా మరి ఎందుకు లేఖ ఇచ్చినట్లు? రాజకీయ నాయకులకు పరిణితి అనేది వుండాలి.

ముందుగా విభజన మాకు అభ్యంతరం లేదు అని లేఖ ఇచ్చి, ఆ తరువాత తూచ్ అంటే మాత్రం ఎవరు వింటారు? అదే విధంగా విభజన సమ్మతమే కానీ సమన్యాయం అని బాబు అన్నారు. సమన్యాయం సాధ్యం కాదని అందరికీ తెలుసు. అందుకే కేంద్రం బాబు చెప్పిన విభజన సమ్మతం అన్నదాన్ని మాత్రం తీసుకుని తన పని తాను కానిచ్చసింది. ఇక కిరణ్ కుమార్ రెడ్డి ప్రదర్శించినన్ని తెలివితేటలు ఎవరూ ప్రదర్శించలేదు. చిరంజీవి చెప్పినట్లు, ప్రతిసారీ జరగదని నమ్మబలకడం, ఆపైన అదే జరగడం తంతుగా మారింది.

ఇలా సీమాంధ్రకు చెందిన ముగ్గరు కీలక నేతలు 'హ్యాండ్'తో 'హ్యాండ్' కలిపిన తరువాత, ఇంతకన్నా గొప్పగా ఏం జరుగుతుంది?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English