కేవీ చౌదరికి రిలయన్సులో కీలక పదవి.. అందుకేనా?

కేవీ చౌదరికి రిలయన్సులో కీలక పదవి.. అందుకేనా?

కేంద్ర విజిలెన్స్ మాజీ చీఫ్ కమిషనర్ కేవీ చౌదరిని రిలయన్స్‌ గ్రూపులో స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించడం సంచలనంగా మారింది. రెండు రోజుల కిందట రిలయన్స్ బోర్డు ఆయన్ను నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ అదనపు డైరెక్టర్‌గా నియమిస్తూ ఆమోద ముద్ర వేసింది. ఈ విషయాన్ని రెగ్యులేటరీ సంస్థలకు కూడా తెలియజేసింది.

స్వతంత్ర డైరెక్టర్‌గా పనిచేసే కేవీ చౌదరికి సంస్థలోని ఏ డైరెక్టర్‌తోనూ సంబంధం ఉండదని రిలయన్స్ సంస్థ ప్రకటించింది. అయితే... కేంద్రంలోని కీలక సంస్థలో పనిచేసి వచ్చిన ఆయన్ను దేశంలోని అతిపెద్ద కార్పొరేట్ సంస్థ నియమించుకోవడం వివాదాస్పదం కావడమే కాదు అనేక అనుమానాలకూ తావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ అధికారి ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు, ప్రధాని మోదీకి కూడా సన్నిహితుడని చెబుతారు.

కేవీ చౌదరి రిలయన్సులోకి రావడంపై వామపక్ష నేతలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. దీనిపై విచారణ జరిపించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. కేంద్ర అవినీతి నిరోధక శాఖ మాజీ అధికారిగా, మోదీ ప్రభుత్వంలో పన్నుల శాఖకు మొట్టమొదటి అధికారిగా పనిచేసిన కేవీ చౌదరికి ఆర్‌ఐఎల్‌లో బాధ్యతలు ఎలా దక్కాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

ప్రభుత్వంలో అవినీతి నిరోధక శాఖ అధికారులుగా పనిచేసిన వారు పదవుల్లో ఉండగా కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకోవడం, పదవి విరమణ చేయగానే సదరు కార్పొరేట్‌ కంపెనీల్లో కీలక పదవులు తీసుకోవడం అలవాటుగా మారిందని సీపీఎం ఆరోపించింది.  ఆయన సీవీసీగా ఉన్న సమయంలో రిలయన్స్ సంస్థకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నింటిపైనా దర్యాప్తు చేయించాలని ఏచూరి డిమాండ్ చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English