విడుదలైన నాలుగేళ్ల తర్వాత ఏం క్రేజ్ బాబోయ్

విడుదలైన నాలుగేళ్ల తర్వాత ఏం క్రేజ్ బాబోయ్

అది లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ మెగా స్క్రీనింగ్ థియేటర్. అక్కడ వేలమంది సీట్లలో ఆసీనులై ఉన్నారు. తెరమీద ‘బాహుబలి: ది బిగినింగ్’ అనే పేరు పడిందంతే. ఆడిటోరియం హోరెత్తిపోయింది. లైవ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సినిమా ప్రదర్శితమవుతుంటే.. మూడు గంటల పాటు ఒకటే కేరింతలు, హర్షధ్వానాలు.

సినిమా ఇంటర్వెల్లో బాల్కనీలో ప్రభాస్ కనిపించాడు ప్రేక్షకులకు. మూమూలు సందడి కాదది. ఇక షో ముగిశాక మరోసారి ఆడిటోరియం హోరెత్తింది. ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలైన నాలుగేళ్ల తర్వాత చోటు చేసుకున్న చిత్రాలివి. మన రాజమౌళి చేసిన భారీ ప్రయత్నానికి దక్కిన గౌరవమిది. లండన్‌లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్‌లో భాగంగా హాలీవుడ్ భారీ సినిమాలతో పాటుగా ‘బాహుబలి’ని కూడా ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

148 ఏళ్ల రాయల్ ఆల్బర్ట్ చరిత్రలో అక్కడ ప్రదర్శితం అయిన తొలి నాన్-ఇంగ్లిష్ సినిమా ‘బాహుబలి’నే కావడం విశేషం. ఈ ప్రత్యేక ప్రదర్శన కోసం ఎన్నో దేశాల నుంచి అతిథులు పనిగట్టుకుని హాజరయ్యారు. నిండైన ఆడిటోరియం మధ్య ‘బాహుబలి: ది బిగినింగ్’ను ప్రదర్శించారు. కీరవాణి బృందం లైవ్ స్కోర్ ఇస్తుండగా.. ‘బాహుబలి-1’ షో సాగడం విశేషం.

ఈ సందర్భంగా ఆడిటోరియంలో కనిపించిన యుఫోరియా నిర్వాహకుల్నే ఆశ్చర్యపరిచింది. ఇలాంటి వాతావరణం మిగతా హాలీవుడ్ సినిమాలకు కూడా లేదంటుండటం విశేషం. ఇక షో మొదలవడానికి ముందు ఆల్బర్ట్ హాల్ బయట రాజమౌళిని గుర్తుపట్టిన కొందరు జపాన్ మహిళా అభిమానులు ఎంతో ఉద్వేగానికి గురవుతూ  కట్టప్పా కట్టప్పా అని అరుస్తూ, ఆయనతో ఫొటో దిగుతూ.. చప్పట్లు కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘బాహుబలి’ ప్రపంచ దేశాల ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుందో చెప్పడానికి ఇది మరో రుజువు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English