జగన్ ఇప్పుడు సీఎం.. అలాంటి భాష వాడతారా?

జగన్ ఇప్పుడు సీఎం.. అలాంటి భాష వాడతారా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసు విచారణకు సంబంధించి సీబీఐ కోర్టులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కోర్టుకు దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ లో వాడిన భాషపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు జగన్ తరఫు న్యాయవాది.

కౌంటర్ లో ఘాటైన పదజాలాన్ని వాడటంతో పాటు.. ఆయన్నుసంబోధించిన వైనం సరిగా లేదన్న అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తుతం గౌరవనీయమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేవించి అలా ఎలా సంబోధిస్తారని ప్రశ్నించారు. గౌరవనీయ ముఖ్యమంత్రి అంటూ ప్రస్తావించాలన్నారు.
అక్రమాస్తుల కేసులో జగన్ హాజరు మినహాయింపుపై జరుగుతున్న వాదనల సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టుకు వచ్చే వారెవరు? వారి స్థాయి అన్నది చూడరు. నిందితులుగానే పరిగణిస్తారు.

కులం.. మతం.. ప్రాంతం.. స్థాయి.. హోదా ఏమైనా కోర్టుకు ఒక్కటే.. చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు అందరిలానే జగన్మోహన్ రెడ్డిని సంబోధిస్తారే కానీ.. సీఎం కాబట్టి ఒకలా.. సామాన్యుడి మరోలా ప్రస్తావించరని అంటున్నారు. జగన్ తరఫు న్యాయవాది వ్యాఖ్యలపై కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English