311 భార‌తీయుల‌ను వెన‌క్కి పంపిన అమెరికా - సంచ‌ల‌న విష‌యాలు

311 భార‌తీయుల‌ను వెన‌క్కి పంపిన అమెరికా - సంచ‌ల‌న విష‌యాలు

అమెరికా...ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది క‌ల‌ల దేశం. ఈ దేశంలో ఉద్యోగ అవ‌కాశం ద‌క్కాల‌నేది ల‌క్ష‌లాది మంది కోరిక ...అక్క‌డ నివసించాల‌నేది మ‌రికొన్ని ల‌క్ష‌ల మంది క‌ల‌. అయితే, ఆ క‌ల అనేక‌మంది విష‌యంలో వివిధ నిబంధ‌న‌ల కార‌ణంగా నెర‌వేర‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ...స‌ద‌రు ఔత్సాహికుల ఆశ చావ‌డం లేదు. అందుకే అడ్డ‌దారులు వెతుక్కుంటున్నారు. అక్ర‌మ వ‌ల‌స‌దారులుగా అమెరికాలో చేరాల‌నుకొని ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే...దొరికిపోతున్నారు. తాజాగా ఇలా మెక్సికో ద్వారా అమెరికాలోకి అక్ర‌మంగా చొర‌బ‌డాల‌ని ప్ర‌య‌త్నించిన 311 మంది భార‌తీయుల‌ను వెన‌క్కి పంపిన విష‌యం తెలిసిందే. వారిలో కొంద‌రు మీడియాతో మాట్లాడుతూ..సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించారు.

అమెరికాలో లీగ‌ల్‌గా సెటిల్ అయ్యే అవ‌కాశం లేక‌పోవ‌డంతో...అక్ర‌మంగా ప్ర‌వేశించేందుకు చాలా మంది విదేశీయులు ప్ర‌య‌త్నిస్తుంటారు. వీరంతా మెక్సికో బోర్డ‌ర్ ద్వారా వెళ్లేందుకు స్కెచ్ వేసుకుంటున్నారు. అయితే ఇటీవల అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో అక్ర‌మ వ‌ల‌స‌ల‌ విష‌యంలో అత్యంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో....మెక్సికో ఇమ్మిగ్రేష‌న్ అధికారులు ఇలాంటి అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌ను ప‌ట్టుకుంటున్నారు. తాజాగా ఇలా ప‌ట్టుబ‌డిన వారిలో సుమారు 311 మంది భార‌తీయులు కూడా ఉన్నారు. దీంతో మెక్సికో ఇమ్మిగ్రేష‌న్ అధికారులు వారిని స్వ‌దేశానికి పంపారు. ప్ర‌త్యేక బోయింగ్ 747 విమానంలో బ‌య‌లుదేరిన వారంతా ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు. వీరి ప‌రిస్థితి, వారు వెల్ల‌డించిన విష‌యాలు ఒల్లు గ‌గుర్పొడిచేలా ఉన్నాయి.

మెక్సికో అధికారులు తిరిగి పంపించిన వారిలో చాలా మందికి క‌నీసం ల‌గేజీ కూడా లేక‌పోవ‌డం వారి ప‌రిస్థితిని స్ప‌ష్టం చేస్తుంది. గౌర‌వ్ కుమార్ అనే భార‌తీయుడు ఢిల్లీ చేరుకున్న త‌ర్వాత  మీడియాతో మాట్లాడుతూ...తాము అమెరికా వెళ్లేందుకు ఓ ఏజెంట్ ద్వారా ప్ర‌య‌త్నించామ‌న్నాడు. అమెరికా వెళ్లాల‌న్న ల‌క్ష్యంతో వ్య‌వ‌సాయ భూమిని, బంగారాన్ని అమ్మేశాన‌న్నాడు. సుమారు 18 ల‌క్ష‌ల డ‌బ్బును ఏజెంట్‌కు క‌ట్టిన‌ట్లు అత‌ను చెప్పాడు. త‌మ ఏజెంట్ అడ‌వుల నుంచి అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడ‌న్నాడు. సుమారు రెండు వారాల పాటు అడ‌వుల్లో న‌డిచామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. మెక్సికో నుంచి అంద‌ర్ని డిపోర్ట్ చేసిన‌ట్లు అత‌ను చెప్పాడు.

మ‌రోవైపు, 311 మంది భార‌తీయుల‌ను వెన‌క్కి పంపిన ఘ‌ట‌న ప‌ట్ల అమెరికా స్పందించింది. భార‌తీయుల‌ను వెన‌క్కి పంపింది నిజ‌మేన‌ని యూఎస్ క‌స్ట‌మ్స్ అధికారి మోర్గ‌న్ స్ప‌ష్టం చేశారు. మెక్సికోలో ఉండేందుకు డాక్యుమెంట్లు లేని కార‌ణంగానే భారతీయుల‌ను వెన‌క్కి పంపిన‌ట్లు తెలిపారు. మాన‌వ అక్ర‌మ ర‌వాణాను ఎట్టి ప‌రిస్థితుల్లో స‌హించేది లేద‌ని ఆయ‌న తేల్చిచెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English