రాజ్ భవన్ వైపు చూడని కేసీఆర్.. వాళ్లేమో రోజూ వెళుతున్నారు

రాజ్ భవన్ వైపు చూడని కేసీఆర్.. వాళ్లేమో రోజూ వెళుతున్నారు

తెలుగు నేల మీద సుదీర్ఘకాలం పాటు గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్ హయాంలో చిత్ర విచిత్రమైన సన్నివేశాలు చాలానే చోటు చేసుకున్నాయని చెప్పాలి. దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో తరచూ రాజ్ భవన్ కు వెళ్లి.. గంటల తరబడి గవర్నర్ గా భేటీ అయ్యే ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు కొత్త ఫేమ్ వచ్చింది.

ఒక గవర్నర్ కు.. ముఖ్యమంత్రికి మధ్య ఇంతటి సన్నిహిత సంబంధం మరే రాష్ట్రంలోనూ లేరన్న మాట తరచూ వినిపించేది. వీరిద్దరి అనుబంధం మీద మోడీ సర్కారుకు కొందరు కంప్లైంట్లు చేసినా.. పట్టించుకోలేదన్న వాదనా ఉంది.

ఇదిలా ఉంటే.. నరసింహన్ స్థానంలో తమిళనాడుకు చెందిన తమిళ సైను గవర్నర్ గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత నుంచి పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చిందని చెప్పక తప్పదు. గతంలో తరచూ రాజ్ భవన్ కు వెళ్లే ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు ఆ వైపే వెళ్లటం లేదంటున్నారు.

అదే సమయంలో తెలంగాణ బీజేపీ నేతలు తరచూ రాజ్ భవన్ కు వెళుతూ.. వినతిపత్రాల్ని సమర్పించి వస్తున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల మీద తమకున్న సమాచారాన్ని గవర్నర్ కు తెలుపుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో రాజ్ భవన్ కు కేసీఆర్ తరచూ వచ్చే దానికి భిన్నంగా ఇప్పుడు కమలనాథులు రెండు రోజులకోమారు రాజ్ భవన్ కు వెళ్లి వినపతిపత్రాలు ఇవ్వటం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందంటున్నారు.

ఆర్టీసీ సమ్మె అంశంతో పాటు గ్రానైట్ ఇష్యూతో పాటు.. టీఆర్ఎస్ సర్కారుకు సంబంధించిన కీలకమైన అంశాలన్ని ప్రధాని మోడీతో భేటీ సందర్భంలో తమిళసై అన్ని విషయాల్ని ఆయనకు తెలిపినట్లుగా సమాచారం. ఈ అంశంపై సమాచారం తెలుసుకున్న సీఎం కేసీఆర్ కాస్తంత చిరాగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణ రాజకీయంలో రాజభవన్ ఎప్పటిలానే తన కీలక భూమిక పోషిస్తూనే ఉందన్న మాట నూటికి నూరు శాతం నిజమంటున్నారు.   


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English