కేసీఆర్ ఫోన్ చేస్తే ఊహించని సమాధానాలు వస్తున్నాయట

కేసీఆర్ ఫోన్ చేస్తే ఊహించని సమాధానాలు వస్తున్నాయట

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తెలంగాణలో తనకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. తాను నమ్మిన దాని కోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా ఉండే ఆయన వైఖరి టీఆర్ఎస్ ముఖ్యనేతలకు ఇప్పుడు కొత్త కష్టంగా మారిందంటున్నారు. దీంతో.. గతంలో ఎప్పుడూ లేని రీతిలో సరికొత్త అనుభవాల్ని సీఎం కేసీఆర్ ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు.

గతంలో మాదిరి కేసీఆర్ ఏం చెబితే దానికి సరే సార్ అనే మాటకు బదులుగా ఇప్పుడు కొత్త తరహాలో రియాక్ట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో తాజాగా ఆయన కొద్ది మంది కీలక మంత్రులకు ఫోన్లు చేసి.. కార్మికుల విషయంలో ఏమేం చేయాలో వ్యూహాల్ని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే.. కేసీఆర్ చెప్పిన తీరు వర్క్ వుట్ కాకపోవటమే కాదు.. ఎదురుదెబ్బ తప్పదన్న విషయాన్ని అర్థం చేసుకున్న సదరు మంత్రులు.. తమకు ఎప్పటి నుంచో అలవాటైన ఎస్ సార్ అన్న దానికి భిన్నమైన సమాధానాన్ని ఇస్తున్నట్లు చెబుతున్నారు.

దీంతో.. కేసీఆర్ అసౌకర్యానికి గురి అవుతున్నట్లు చెబుతున్నారు. తన మాటకు ఎస్ సార్ అన్న మాట తప్పించి.. మరో మాట రాని దానికి భిన్నంగా.. పరిస్థితి ఇలా ఉంది.. ఇప్పుడిలా చేస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్న మాటకు కేసీఆర్ చిరాకు పడిపోతున్నట్లు సమాచారం. మరి.. ఇదెంతవరకూ నిజమన్నది రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలు స్పష్టం చేసే వీలుందని చెప్పక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English