వాళ్లు మళ్లీ గోడ దూకుతారట..

వాళ్లు మళ్లీ గోడ దూకుతారట..

తెలుగుదేశం పార్టీలో మాజీలను కాపాడుకోవడం ఇప్పుడు చంద్రబాబుకు కష్టంగా మారింది. మరీ ముఖ్యంగా గతంలో గోడ దూకి టీడీపీలోకి వచ్చిన నాయకులను పార్టీలో ఉండేలా చేయడం మరీ సమస్యగా మారుతోందట. వారంతా ఇప్పుడు మళ్లీ వైసీపీ వైపు చూస్తుండడంతో చంద్రబాబు కూడా వెళ్లేవాళ్లు వెళ్లనీ అని  ఆ విషయం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. గతంలో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన నేతలు కొందరు ఇప్పుడు వైసీపీలో వెళ్లేందుకు సిద్ధమవుతున్న సంగతి చంద్రబాబు వరకు వచ్చినా ఆయన లైట్‌గా తీసుకున్నారని టాక్. వారితో పాటు సుదీర్ఘకాలంగా టీడీపీలోనే ఉన్న నేతలూ కొందరు వైసీపీ వైపు చూస్తున్నారట.

అనంతపురం జిల్లాకు చెందిన మాజీ విప్ యామినీ బాల వైసీపీకి ద‌గ్గర‌య్యేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నట్టు స‌మాచారం. ఆమె తల్లి శ‌మంత‌క‌మ‌ణి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె పదవీ కాలం పూర్తయిన తరువాత ఇద్దరూ పార్టీ వీడుతారని ప్రచారం జరుగుతోంది. చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు మాజీ ఎమ్మెల్యే, మంత్రి అమ‌ర్‌నాథ్ రెడ్డి కూడా టీడీపీ నుంచి తిరిగి వైసీపీలోకి చేరేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నారట. 2014లో వైసీపీ టికెట్‌పై గెలిచిన ఆయ‌న త‌ర్వాత సైకిలెక్కి.. మంత్రి ప‌ద‌వి సంపాయించుకున్నారు. ఇప్పుడు ఓట‌మి పాల‌వ‌డంతో జ‌గ‌న్ చెంత‌కు చేరేందుకు ప్రయ‌త్నాలు ప్రారంభించారని టాక్.

రంప‌చోడ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వంత‌ల రాజేశ్వరి కూడా జ‌గ‌న్ చెంత‌కు చేరాల‌ని నిర్ణయించుకున్నారు. 2014లో ఈమె కూడా వైసీపీ టికెట్‌పై విజ‌యం సాధించి, త‌ర్వాత టీడీపీలో చేరి మంత్రయ్యారు.  పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వర్గ మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ కూడా తిరిగి వైసీపీలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English