ఆర్టీసీ సమ్మె.. టీఆరెస్‌లో కుమ్ములాటలు

ఆర్టీసీ సమ్మె.. టీఆరెస్‌లో కుమ్ములాటలు

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పాలక టీఆరెస్ ఎమ్మెల్యే చేసిన ఆరోపణ సంచలనం రేపుతోంది. ఆర్టీసీ సమ్మెకు ఆజ్యం పోస్తున్నది తమ పార్టీ నాయకులేనని ఆయన ఆరోపించారు. దీంతో ఇప్పటికే టీఆరెస్‌లోను, ఇతర పార్టీల్లోనూ దీనిపై వస్తున్న ఆరోపణలు, జరుగుతున్న చర్చకు బలం చేకూరినట్లయింది.

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వెనుక తమ పార్టీ నేతలు ఉన్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారే ఈ సమ్మెకు ఆజ్యం పోశారని, ఈ విషయాన్ని తాను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రతరమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముత్తిరెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం టీఆర్ఎస్ ను మరింత ఇరుకున పెడుతోంది.

కాగా ముత్తిరెడ్డి కేసీఆర్‌ను కలిసి ఎవరెవరి పేర్లు చెబుతారా అన్న చర్చ అప్పుడే ఆ జిల్లాలో మొదలైంది. ముత్తిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు టీఆర్ఎస్ నేతలు ఎవరూ స్పందించలేదు. మరోవైపు, ఆర్టీసీ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. టీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావు నిన్న ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు జిల్లాల్లో జరుగుతున్న సమ్మె విషయంలో టీఆరెస్ నాయకుల్లోనూ కొందరు ఆర్టీసీ కార్మికులకు లోలోపల మద్దతు పలికినట్లు ఆరోపణలు `. ఇతర జిల్లాల్లోనూ ముత్తిరెడ్డి తరహాలో కొందరు టీఆరెస్ ఎమ్మెల్యేలు సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముత్తిరెడ్డి కనుక మొదలుపెడితే మిగతా నేతలూ కేసీఆర్ వద్దకు ఫిర్యాదులు చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English