వామ్మో.. హుజూర్ నగర్ కు బాబు ఆమెను పంపుతున్నారా?

వామ్మో.. హుజూర్ నగర్ కు బాబు ఆమెను పంపుతున్నారా?

ఎన్నికల ప్రచారానికి ఎవరైనా ప్రముఖులు వస్తున్నారంటే ఆ ప్రాంతానికి చెందిన వారంతా ఉత్సాహంగా చూస్తారు. ఇక.. ఆయా పార్టీలకు చెందిన వారు వచ్చే వారి కారణంగా తమకు మైలేజీ పెరిగి అంతోఇంతో ప్రయోజనం కలుగుతుందన్న భావన వ్యక్తమవుతుంటుంది. ఇందుకు భిన్నంగా తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో అవాక్కు అవుతున్నారు. ఇలాంటి నిర్ణయాలు చంద్రబాబుకు మాత్రమే సాధ్యమంటున్నారు.

హుజూర్ నగర్ లో టీడీపీ అభ్యర్థిని దింపటమే అనవసరమన్న మాట వినిపిస్తున్న వేళ.. తాజాగా అభ్యర్థి కిరణ్మయి తరఫున ప్రచారం చేసేందుకు నందమూరి సుహాసిని పంపాలని బాబు భావించటం తమ్ముళ్లకు షాకింగ్ గా మారింది. గత ఎన్నికల్లో కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన సుహాసిని.. తన ఎన్నికల ప్రచారం సందర్భంగా  చేసిన ప్రసంగాలు ఎన్ని జోకులు పేలాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

విడిగా చక్కగా మాట్లాడే నందమూరి సుహాసినికి స్టేజ్ ఫియర్ కావటం.. మాటలు తడబడటం.. చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పలేకపోవటం లాంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. తాను బరిలోకి దిగిన చోటే.. ఓటర్ల మనసు దోచుకోవటంలో ఫెయిల్ అయిన సుహాసిని.. హోరాహోరీగా సాగుతున్నహుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారానికి పంపటానికి మించిన తెలివి తక్కువ పని ఇంకొకటి ఉండదంటున్నారు. ఇప్పటికే ప్రచారంలో టీడీపీ అభ్యర్థి కిర్మయివెనుకబడి ఉన్నారని.. సుహాసిని లాంటి వారిని ప్రచారానికి పంపటం ద్వారా.. ఆమె మాటలతో కామెడీగా మారే ప్రమాదం పొంచి ఉందంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English