గంగూలీ వ‌చ్చాడు.. ర‌విశాస్త్రికి బ్యాండేనా?

గంగూలీ వ‌చ్చాడు.. ర‌విశాస్త్రికి బ్యాండేనా?

నాలుగేళ్ల కింద‌టి మాట. భార‌త క్రికెట్ జ‌ట్టు కోచ్ ప‌ద‌వికి అనిల్ కుంబ్లేతో పాటు ర‌విశాస్త్రి కూడా రేసులో నిలిచాడు. కానీ సౌర‌భ్ గంగూలీ నేతృత్వంలోని బీసీసీఐ క్రికెట్ స‌ల‌హా క‌మిటీ ర‌విశాస్త్రిని ప‌క్క‌న పెట్టి కుంబ్లేను కోచ్‌గా ఎంపిక చేసింది. అప్ప‌టికి భార‌త జ‌ట్టుకు తాత్కాలికంగా డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిన ర‌విశాస్త్రి కోచ్ ప‌ద‌విపై ఆశ‌లు పెట్ట‌కుని నిరాశ చెందాడు.

ఈ క్ర‌మంలో గంగూలీపై విమ‌ర్శ‌లు గుప్పించాడు. గంగూలీ సైతం దీటుగా బ‌దులిచ్చాడు. క‌ట్ చేస్తే ఏడాది త‌ర్వాత కోహ్లితో గొడ‌వ కార‌ణంగా కుంబ్లే ప‌ద‌వి నుంచి దిగిపోగా.. కెప్టెన్‌కు ఇష్టుడైన ర‌విశాస్త్రినే గంగూలీ క‌మిటీ కోచ్‌గా ఎంపిక చేయాల్సి వ‌చ్చింది. అది గంగూలీ అభిమానుల‌కు రుచించ‌లేదు. దాదా వ్య‌తిరేకించిన వ్య‌క్తికే అత‌ను కోచ్‌గా అవ‌కాశ‌మివ్వాల్సి రావ‌డాన్ని వాళ్లు జీర్ణించుకోలేక‌పోయారు.

ఐతే కాలం ఎప్పుడూ ఒక‌లా ఉండ‌దు క‌దా. ఇప్పుడు గంగూలీ బీసీసీఐ అధ్య‌క్షుడ‌య్యాడు. ర‌విశాస్త్రి అత‌డి కిందే ప‌ని చేస్తున్న‌ట్లు. దాదాకే అత‌ను జ‌వాబుదారీగా ఉండాలి. కొన్ని నెల‌ల కింద‌ట ప్ర‌పంచ‌క‌ప్‌లో కెప్టెన్ కోహ్లి, కోచ్ ర‌విశాస్త్రి జ‌ట్టు ఎంపిక‌లో ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రించార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. క‌ప్పు గెలిచేందుకు త‌గ్గ బ‌లం ఉన్నా సెమీస్‌లో వెనుదిర‌గ‌డానికి సెల‌క్ష‌న్ నిర్ణ‌యాలే కార్ణ‌మ‌న్న అభిప్రాయాలూ వినిపించాయి.

అయినా టోర్నీ అయ్యాక బీసీసీఐ వారి నుంచి వివ‌ర‌ణ కోర‌లేదు. స‌మీక్ష జ‌ర‌ప‌లేదు. ఐతే అప్పుడు బీసీసీఐని న‌డిపిస్తున్న‌ది సీఓఏ. కానీ ఇప్పుడు గంగూలీ వ‌చ్చాడు. ఇక‌పై టీమ్ ఇండియాపై అత‌డి నియంత్ర‌ణ ఉంటుంది. గంగూలీ వ్య‌క్తిత్వం ప్ర‌కారం అతి చేస్తే ఎవ‌రి తోకైనా కోస్తాడు. ఈ నేప‌థ్యంలో అత‌డిక‌స్స‌లు న‌చ్చ‌ని ర‌విశాస్త్రికి ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English