రైతు భరోసా.. జగన్‌పై తీవ్ర విమర్శలకు కారణం కానుందా?

రైతు భరోసా.. జగన్‌పై తీవ్ర విమర్శలకు కారణం కానుందా?

ఏపీలో జగన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం ఇప్పుడు ఆయన ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శల పాలు చేసే కార్యక్రమంగా మారనుందన్న విమర్శలు వినిపిస్తున్నయి. ఆ పథకం ఇప్పటికీ బాలారిస్టాల్లోనే కొట్టుమిట్టాడుతుండడంతో అవకతవకలకు, అక్రమాలకు దారితీసి ప్రభుత్వానికి మచ్చతెచ్చే ప్రమాదం ఉందంటున్నారు. దీనికి కారణం... అర్హుల ఎంపికలో చాలా ఇబ్బందులు ఎదురవుతుండడం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 79 లక్షల రైతు ఖాతాలలో 30లక్షల ఖాతాల వివరాలు రైతు జాబితాలో సరిపోలకపోవడమేనట.

రైతు భరోసాకు ప్రజాసాధికార సర్వేను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే ఇదే రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. తప్పులతడకగా ఉన్న ప్రజాసాధికార సర్వే కారణంగా అధికశాతం మంది రైతులు రైతుభరోసాకు అనర్హులవుతున్నారు. ఆధార్‌ కూడా తిప్పలు తెస్తోంది. అధిక శాతం మంది రైతుల ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం కాలేదు.

పీఎం కిసాన్‌ లబ్ధిదారుల జాబితా ప్రకారం 7లక్షల మంది ఆధార్‌ వివరాలు తప్పుగా నమోదయ్యాయి. రైతుల భూ వివరాలతో ఇవి సరిపోలట్లేదు. కౌలు రైతుల గుర్తింపులోనూ కష్టాలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా. సాగుదారు హక్కులచట్టం కింద ఇచ్చే కార్డులు ఇంకా మొదలు కాలేదు. ఫలితంగా కౌలురైతులకు గుర్తింపు ప్రశ్నార్థకమవుతోంది.

పీఎం కిసాన్‌ నిధులుపొందే వారిని మినహాయిస్తే మిగిలిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వమే ఏడాదికి 12వేల 500 ఇవ్వాలి. క్షేత్రస్థాయిలో ఇదీ సమస్యగా మారనుంది. అయితే, పథకాల అమలులో సమస్యలు ఏర్పడినప్పుడే ఎక్కువగా అవకతవకలు జరుగుతాయి. ఇక్కడా అలాంటి అవతవకలకు ఆస్కారముందని.. అధి ముందుముందు జగన్ ప్రభుత్వాన్ని విమర్శలకు గురిచేయొచ్చన్న మాట వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English