ఆ కండక్టర్ ఉరికి కారణం ఎవరు?

ఆ కండక్టర్ ఉరికి కారణం ఎవరు?

ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మబలిదానం ఆవేదన తీరక ముందే.. హైదరాబాద్ కు చెందిన ఆర్టీసీ కండక్టర్ సురేందర్ గౌడ్ ఉరి వేసుకున్నారు. కార్వాన్ ప్రాంతంలోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో సురేందర్ గౌడ్ నివాసం. ఇద్దరు పిల్లలు. కుమార్తెకు ఏడాది కింద పెళ్లి చేశారు. భార్య టైలరింగ్ చేస్తుంటారు. జీతాన్ని ష్యూరిటీగా పెట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ తీసుకున్నారు.

ప్రతి నెల ఈఎంఐగా తీసుకున్న రుణాన్ని జీతం వచ్చిన వెంటనే చెల్లించేవాడు. వారం క్రితం వరకూ అనారోగ్యంతో ఉండటం.. రెండురోజులుగా తాను పని చేస్తున్న రాణిగంజ్ డిపోకు వెళ్లి సమ్మెలో పాల్గొంటున్నారు. ఆదివారం ఉదయం ఈఎంఐ బౌన్స్ అయినట్లుగా బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. గత నెలలో పని చేసిన దానికి ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా నిలిపివేయటంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

సమ్మె చేస్తున్న కార్మికుల ఉద్యోగాలు పోయినట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేస్తున్న నేపథ్యంలో.. ఉద్యోగం విషయంలో తీవ్ర మనోవేదనకు గురైనట్లుగా అతని సతీమణి వెల్లడించారు. ఉద్యోగం నుంచి తొలగించామని ముఖ్యమంత్రి చెప్పటంతో తన భర్త చాలా కలత చెందారని.. ఉద్యోగం పోతే ఎలా అన్న ఆందోళనతో ముభావంగా ఉన్న ఆయన.. ఆదివారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని వేళ ఈ ఘటన జరిగింది.

తల్లికొడుకు బయటకు వెళ్లి.. ఇంటికి తిరిగి వచ్చిన వేళ తలుపు ఎంతకూ తీయకపోవటంతో అనుమానంతో కిటీకీ లో నుంచి చేశారు. అప్పటికే ఉరి వేసుకున్న వైనాన్ని గుర్తించి.. ఇంటి కింద ఉన్న వారిసాయంతో తలుపు బద్దలు కొట్టి రక్షించే ప్రయత్నం చేశారు. దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు చెప్పారు. ఉద్యోగాలు పోయాయన్న సీఎం కేసీఆర్ మాటే తన భర్త మరణానికి కారణంగా సురేందర్ గౌడ్ సతీమణి చెబుతున్నారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English