తెలంగాణ ఆర్టీసీ ఎఫెక్ట్‌: భారీ లాభాల్లో ఏపీఎస్ఆర్టీసీ

తెలంగాణ ఆర్టీసీ ఎఫెక్ట్‌: భారీ లాభాల్లో ఏపీఎస్ఆర్టీసీ

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ అనేది పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. తెలంగాణ‌లో ఆర్టీసీ కార్మికులు ప‌ది రోజులుగా చేస్తోన్న స‌మ్మె ఉధృతం అయిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)కి దసరా సీజన్‌లో భారీగా ఆదాయం వచ్చింది.

దసరా సీజన్‌లో మొత్తం రూ.229 కోట్ల ఆదాయాన్ని సంస్థ ఆర్జించింది. ఇక గ‌తేడాది ద‌స‌రా సీజ‌న్లో సంస్థ‌కు రు. 209 కోట్ల ఆదాయం రాగా.. అదే ఈ యేడాది మ‌రో రు.20 కోట్లు పెరిగి మొత్తం రు.229 కోట్ల ఆదాయం సంపాదించింది.

పొరుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌లో ఆర్టీసీ కార్మికుల స‌మ్మె కూడా ఏపీఎస్ఆర్టీసికి క‌లిసొచ్చింది. ఈ పండక్కి అదనంగా 5,887 ప్రత్యేక బస్సులను తిప్పిన ఏపీఎస్ఆర్టీసీ ఈ సర్వీసుల్లో 50 శాతం అధిక ఛార్జీలు వసూలు చేసింది.

దీంతో సంస్థ‌కు ఎక్కువ ఆదాయం వ‌చ్చింది. ఇక ఈ ద‌స‌రా సీజ‌న్లో గ‌త నెల 27వ తేదీ నుంచి ఈ నెల 13 వ‌ర‌కు బ‌స్సుల్లో ఎక్కువ మంది ప్ర‌యాణించిన‌ట్టు కూడా ఆర్టీసీ స్ప‌ష్టం చేసింది.

ఇటు ద‌స‌రా సీజ‌న్ కావ‌డం... అటు తెలంగాణ‌లో ఆర్టీసీ కార్మికులు స‌మ్మె చేయ‌డంతో ఏపీఎస్ఆర్టీసీకి మ‌రింత ఆదాయం రావాల్సి ఉంది. అటు ప్రైవేటు ట్రావెల్స్ సైతం రేట్లు త‌గ్గించ‌డంతో కొంత ఆదాయం త‌గ్గింద‌నే చెప్పాలి.

ఏపీఎస్ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌తి రోజు  71 లక్షల మంది ప్రయాణిస్తారు. వీరి ద్వారా సంస్థ‌కు రోజుకు రు.13 కోట్ల ఆదాయం ఛార్జీల రూపంలో ల‌భిస్తుంది. ఇక సంస్థ‌ ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్‌) ఏకంగా 103 శాతంగా నమోదైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English