వాట్సాప్ పేమెంట్ రెడీ...

వాట్సాప్ పేమెంట్ రెడీ...

ఆన్‌లైన్ న‌గ‌దు చెల్లింపుల కోసం ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న వ్య‌వ‌స్థ‌ల‌తో పాటు కొత్త యాప్‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి బ్యాంక్‌ల‌కు యాప్‌లు ఉంటున్నాయి. వీటితో పాటు గూగుల్ పే, ఫోన్ పే లాంటి యాప్‌లు ఖ‌చ్చిత‌మైన న‌గ‌దు చెల్లింపు యాప్‌లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇక ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా దిగ్గజం,
మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి కూడా న‌గ‌దు పే చేసుకునే వెసులు బాటు వ‌చ్చేసింది.

వాట్సాప్ నుంచి రెండు నెల‌ల్లో డిజిట్ పేమెంట్ స‌ర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విష‌యంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) ముఖ్య కార్యనిర్వహణాధికారి దిలీప్ అస్బే క్లారిటీ ఇచ్చారు. కొద్ది రోజులుగా ఇదే అంశంపై క‌స‌ర‌త్తు చేస్తోన్న వాట్సాప్ ట్రైల్ ర‌న్లో స‌క్సెస్ అవ్వ‌డంతో దీనిని అందుబాటులోకి తీసుకు రానున్నారు. వాస్త‌వానికి గ‌త యేడాది కాలం నుంచే వాట్సాప్ డిజిట‌ల్ పేమెంట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

దీనిని ప్ర‌యోగాత్మ‌కంగా త‌మ‌కు న‌మ్మ‌క‌స్తులు అయిన కొంత‌మందితో అమ‌లు చేస్తూ వ‌స్తోంది. ఇక ఇప్ప‌టికిప్పుడు ఇది ప్రారంభించినా న‌గ‌దు వ్య‌వ‌స్థ‌పై ఇది ప్ర‌భావం చూపడానికి క‌నీసం రెండు సంవ‌త్స‌రాలు ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. వాట్సాప్ పే సేవ‌లు పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తే దేశంలోని 30 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారులకు ఈ సౌకర్యం లభించనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English