బాబుకు భారీ షాక్‌... టీడీపీ కార్యాల‌యాన్ని కూల్చే పనిలో జగన్

బాబుకు భారీ షాక్‌... టీడీపీ కార్యాల‌యాన్ని కూల్చే పనిలో జగన్

చంద్రబాబు మీద ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం ఇంకా తగ్గినట్టు లేదు. అధికారంలోకి వ‌చ్చీ రాగానే అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు..  అమరావతిలో నిర్మించిన ప్ర‌జా వేదిక‌ను రోజుల వ్య‌వ‌ధిలో కూల్చేసిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆ త‌ర్వాత ప్రైవేటు వ్య‌క్తులు..  నిర్మించుకున్న అక్ర‌మ క‌ట్టడాల‌కు నోటీసులు జారీ చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఇక‌, ఇప్పుడు తాజాగా చంద్ర‌బాబు త‌న పార్టీ కోసం గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని జాతీయ ర‌హ‌దారి వెంబ‌డి భారీ ఎత్తున నిర్మిస్తున్న రాష్ట్ర పార్టీ కార్యాల‌యానికి కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం నోటీసులు జారీ చేసింది.

ఇక్క‌డ పార్టీ ఆఫీసు కోసం అధికారంలో ఉన్నపుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వ భూముల‌ను కేటాయించారు. నిర్మాణాల‌ను కూడా యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయిస్తున్నారు. సీఎం హోదాలో రెండు సార్లు ఆయ‌న ఇక్క‌డి నిర్మాణాల‌ను కూడా ప‌రిశీలించారు. అయితే, వీటిపై లోతైన విచార‌ణ చేప‌ట్టిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. తాజాగా నోటీసులు ఇచ్చింది.

అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు.. సంబంధిత అధికారుల‌పై ఒత్తిడి తెచ్చి..  ప్రభుత్వ వాగు పోరంబోకు భూమి, ప్రైవేటు రైతుల భూములను ఆక్రమించి మండలంలోని ఆత్మకూరు గ్రామం (మంగ‌ళ‌గిరి జాతీయ ర‌హ‌దారి వెంబ‌డి) జాతీయ రహదారి వెంట టీడీపీ కార్యాలయ భవనం నిర్మిస్తున్నారని వైకాపా ఆరోపిస్తోంది.

అనుమ‌తులు లేని భూముల్లో పార్టీ కార్యాల‌యం ఎలా నిర్మిస్తార‌ని ప్ర‌శ్నించ‌డంతోపాటు.. 392/2 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ వాగు పోరంబోకుతో పాటు ప్రైవేటు రైతులకు చెందిన భూములను ఆక్రమించి నిర్మాణం ఎలా చేప‌డ‌తార‌ని ప్రశ్నించింది. దీనికి సంబంధించి నిర్మాణదారులకు ప్రభుత్వ భూములలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేశారు.

మంగళగిరి తహసీల్దార్‌ రామ్‌ప్రసాద్‌ నోటీసులు జారీ చేసిన ఏడు రోజులలోపు ప్రభుత్వ భూమిలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని, లేనిపక్షంలో తామే తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ప‌రిణామం ఎటు దారి తీస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English