జగన్ కీలక భేటీలు వాయిదా పడ్డాయెందుకు?

జగన్ కీలక భేటీలు వాయిదా పడ్డాయెందుకు?

ఏపీ సీఎం జగన్ ఈ రెండు రోజుల్లో జరపాల్సిన కీలక భేటీలు రెండూ వాయిదా పడ్డాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవితో జగన్ శుక్రవారం భేటీ కావాల్సి ఉండగా అది వాయిదా పడింది. అలాగే, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలతో జరగాల్సిన భేటీ కూడా వాయిదా పడింది.

చిరంజీవి, రామ్‌చరణ్‌లు సీఎం జగన్‌ను శుక్రవారం కలవాల్సి ఉంది. వారిద్దరూ సీఎంను కలిసి సైరా నరసింహారెడ్డి సినిమాను వీక్షించేందుకు ఆహ్వానించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ భేటీ సోమవారానికి వాయిదా పడినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  14న చిరంజీవి, రామ్‌చరణ్‌లు జగన్‌ మోహన్ రెడ్డిని కలుస్తారు.

చిరంజీవి సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్రమం తప్పంకుండా జగన్‌పై విమర్శలు కురిపిస్తున్న నేపథ్యంలో చిరంజీవి ఇలా జగన్‌ను కలవాలనుకోవడం రాష్ట్రమంతటా ఆసక్తి రేపింది. శుక్రవారం జగన్, చిరంజీవి భేటీ ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా చూశారు. ఇప్పుడది సోమవారానికి వాయిదా పడింది.

మరోవైపు జగన్‌ ఢిల్లీ టూర్‌ కూడా వాయిదా పడింది. శుక్రవారం జగన్‌ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కావాల్సి ఉండగా పర్యటన రద్దు చేశారు. అమిత్ షా మహారాష్ట్ర వెళ్లాల్సి రావడంతో జగన్‌తో భేటీ వాయిదా పడింది. దాంతో ముఖ్యమంత్రి పర్యటన రద్దు అయినట్టు ఏపీ భవన్‌ ప్రకటించింది. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోడీని జగన్ కలిశారు.

హోంమంత్రి ఆ రోజు అందుబాటులో లేకపోవడంతో కలవలేకపోయారు. ఇప్పుడు మోదీ, అమిత్ షాలు ఇద్దరినీ కలవాలని జగన్ అనుకున్నప్పటికీ మోదీ అందుబాటులో లేకపోవడంతో మళ్లీ భేటీ వాయిదా పడింది.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English