జియో యూజ‌ర్ల‌కు చేదు వార్త‌

జియో యూజ‌ర్ల‌కు చేదు వార్త‌

ఇప్పుడు మొబైల్ వినియోగ‌దారుల్లో మెజారిటీ జియో యూజ‌ర్లే. ఇంట‌ర్నెట్ డేటాను చ‌వ‌క‌గా మార్చి, మొబైల్ యూజ‌ర్లంద‌రూ జియో వైపు చూసేలా చేసింది ముకేష్ అంబానీ సంస్థ‌. దేశంలో మొబైల్‌ ఇంట‌ర్నెట్ విప్ల‌వానికి ఈ సంస్థే కార‌ణం. ప్ర‌స్తుతం స్మార్ట్ ఫోన్ వాడుతూ జియో వినియోగించ‌ని వాళ్లు అరుద‌నే చెప్పాలి.

ఒక నెల‌కు డేటా కోసం వాడే డ‌బ్బుల‌తో మూడు నెల‌ల పాటు స‌మృద్ధిగా డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ అందిస్తోంది జియో. ఇప్ప‌టిదాకా త‌న యూజ‌ర్ల‌కు తీపి క‌బుర్లే చెబుతూ వ‌చ్చిన జియో.. తొలిసారిగా చిన్న షాక్ ఇవ్వ‌బోతోంది. జియో నుంచి వేరే నెట్‌వ‌ర్క్‌ల‌కు కాల్స్ చేస్తే అద‌నంగా ఛార్జ్ చేయ‌బోతోంది. ఈ టారిఫ్ నిమిషానికి 6 పైస‌లుగా ఉండ‌బోతోంది.

ఇది జియో సొంతంగా తీసుకున్న నిర్ణ‌యం కాదు. ఐయూసీ ఛార్జీల విష‌యంలో ట్రాయ్ నిబంధ‌న‌ల మేర‌కు ఇలా వినియోగ‌దారుల‌పై భారం మోప‌క త‌ప్ప‌డం లేద‌ని జియో అంటోంది. అక్టోబ‌రు 10 త‌ర్వాత రీచార్జ్ చేసుకునేవాళ్ల‌కు ఈ నిబంధ‌న వ‌ర్తిస్తుంది. రెగ్యుల‌ర్ రీఛార్జితో పాటు ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు కాల్ చేయ‌డం కోసం టాప్ అప్ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఐతే ఇక్క‌డో చిన్న సౌల‌భ్యం ఉంది. ఇలా ఖ‌ర్చు పెట్టే అద‌న‌పు డ‌బ్బుల్ని డేటా రూపంలో తిరిగి ఇచ్చేస్తుంద‌ట జియో. రోజువారీ డేటా ప‌రిమితి పూర్త‌య్యాక.. అద‌నంగా వాడే డేటా కోసం దీన్ని వినియోగించుకోవ‌చ్చు. ఐతే ప్ర‌స్తుతం మెజారిటీ యూజ‌ర్లు జియోనే వాడుతున్న నేప‌థ్యంలో ఇది మ‌రీ భారం అనుకోవాల్సిన ప‌ని లేదు. ఈ కొత్త నిబంధ‌నకు సంబ‌ధించి పూర్తి స్ప‌ష్ట‌త కోసం ఒక‌ట్రెండు రోజులు వేచి చూడాల్సి ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English