స‌ర్దార్ ప‌టేల్... విజ‌య‌సాయిరెడ్డి ఒక‌టేన‌ట‌

స‌ర్దార్ ప‌టేల్... విజ‌య‌సాయిరెడ్డి ఒక‌టేన‌ట‌

ఐర‌న్ మ్యాన్ అన‌గానే...మ‌న‌కు ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది స‌ర్దార్ వ‌ల్ల‌భ‌భాయ్ ప‌టేల్‌. దాంతో వెంట‌నే కాంగ్రెస్- బీజేపీల మ‌ధ్య సాగుతున్న రాజ‌కీయ యుద్ధం. భార‌త‌దేశంలోని రాజ్యాలు, సంస్థానాల‌ను విలీనం చేయ‌డంలో ఆయ‌న కృషి మ‌రువ‌లేనిద‌ని, అందుకే ఆయ‌న్ను ఐర‌న్ మ్యాన్ ప్ర‌శంసిస్తుంటే...కాంగ్రెస్ మాత్రం వాటి గురించి పెద్ద‌గా ప్ర‌స్తావించ‌ద‌ని బీజేపీ నేత‌లు అంటుంటారు.

ఈ విష‌యం ప‌క్క‌న పెడితే...ఇప్పుడు ఏపీలో కూడా ఓ ఐర‌న్‌మ్యాన్ ఉన్నార‌ట‌. ఆయ‌న ఎవ‌రంటే....ఎంపీ, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజయసాయిరెడ్డి. ఈ మాట చెప్పింది సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న జూపూడి ప్రభాకర్ రావు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే...ఆ పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి రావ‌డంతో తిరిగి ఆయ‌న వైసీపీలో తాజాగా పార్టీ చీఫ్, సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డి స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని, ఆయ‌న వెంట ఉన్న విజ‌య‌సాయిరెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు.  

ఇక త‌న చేరిక గురించి వివ‌రిస్తూ, "నవరత్నాలు, అసెంబ్లీలో పెట్టిన బిల్లులు కానీ చూస్తే దాదాపు 85 శాతం మంది బడుగు, బలహీనవర్గాలు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారి పాలన మళ్ళీ వస్తుందని భావిస్తున్నారు అని తెలిపారు. "జ‌గన్‌ గారు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ అనేక భాదలు చవిచూశారు. మేం తప్పిపోయిన గొర్రెల్లాగా అటూ ఇటూ పోయి ఉండొచ్చు. నిర్మొహమాటంగా చెప్తున్నా.నాయకులంతా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఒక్క నిముషం కూడా ఆలస్యం చేయవద్దని, ఎలాంటి షరతులూ లేకుండా, ఒక సామాన్య కార్యకర్తలా పార్టీలో చేరాను." అని తెలిపారు. కాగా, జూపూడి కామెంట్లు స‌హ‌జంగానే చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English