టీవీ9 రవి ప్రకాశ్ అరెస్ట్.. కేసీఆర్ దిల్లీ వెళ్లి రాగానే పోలీసుల దూకుడు

టీవీ9 రవి ప్రకాశ్ అరెస్ట్.. కేసీఆర్ దిల్లీ వెళ్లి రాగానే పోలీసుల దూకుడు

టీవీ9 మాజీ సీఈవో, ఆ చానల్ వ్యవస్థాపకుడు రవి ప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పది మంది పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుని తమతో తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడిని బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేశారో.. ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారో కూడా పోలీసులు చెప్పలేదని రవి ప్రకాశ్ అనుచరులు చెబుతున్నారు.

టీవీ9 యాజమాన్యం మారిన తరువాత రవి ప్రకాశ్ కేసుల్లో చిక్కుకున్నారు. సంత‌కాలు పోర్జ‌రీ చేసి యాజ‌మాన్యాన్ని ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేశారన్న ఆరోపణలతో పాటు నిధులు మ‌ళ్లించిన ఆరోప‌ణ‌లు ఆయన ఎదుర్కొన్నారు. ఆ క్రమంలోనే ఆయన కొన్నాళ్లపాటు కనిపించకుండాపోయారు. ఆ సమయంలో ఆయనపై లుక్ అవుట్ నోటీసు కూడా జారీ అయింది.

చివరకు ఆయన జూన్ నెలలో ఎట్టకేలకు పోలీసుల ఎదుట హాజరయ్యారు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో రవిప్రకాష్ విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టులో సయితం ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవడం, అక్కడ కూడా ఎదురుదెబ్బ తగలడంతో రవిప్రకాష్ పోలీసుల ఎదుటకు రాకతప్పలేదు.

అలంద మీడియా ప్రతినిధుల ఫిర్యాదు మేరకు అప్పటికే రవిప్రకాష్ పైనా, సినీనటుడు శివాజీలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. అప్పుడే ఆయన్ను అరెస్టు చేస్తారని భావించినా ఎందుకో ఆ విషయం మరుగునపడింది. రవి ప్రకాశ్ కేంద్రంలోని బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలున్నాయన్న ప్రచారం నేపథ్యంలో ఆయన అరెస్టుకు రాష్ట్రం వెనుకాడిందని అంతా భావించారు.

ఆ తరువాత రవిప్రకాశ్, బీజేపీ కాంబినేషన్లో ఓ టీవీ చానల్ రానుందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం దిల్లీ పర్యటలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలవడం.. ఆయన అక్కడి నుంచి వచ్చిన మరునాడే రవి ప్రకాశ్‌ను అరెస్ట్ చేయడంతో కొత్తగా అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English