నేనెళ్ళ.. నేనెళ్ళనంటున్న జానారెడ్డి

నేనెళ్ళ.. నేనెళ్ళనంటున్న జానారెడ్డి

కాంగ్రెసు పార్టీని వీడే ప్రసక్తే లేదని, కాంగ్రెసు పార్టీలోనే ఉంటూ తెలంగాణ కోసం పోరాటం సాగిస్తానని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కె.జానారెడ్డి స్పష్టంగా చెప్పారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పి తెలంగాణ ప్రజలను కాంగ్రెసు పార్టీ మోసం చేసిందని ఆరోపిస్తూ ఆ పార్టీకి చెందిన ఎంపీలు వివేక్‌, మంద జగన్నాధం, పీసీసీ మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు, మాజీ మంత్రి వినోద్‌లు పార్టీ మారడానికి సిద్ధం కాగా, జానారెడ్డి మాత్రం, పార్టీని వీడబోనని చెప్పడం ఆశ్చర్యంగానే ఉంది.

తెలంగాణ కాంగ్రెసు నేతల బృందానికి జానారెడ్డి నేతృత్వం వహించారు ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో. కాని ఆయన నాయకత్వాన్ని తెలంగాణ కాంగ్రెసు నేతలెవరూ అంగీకరించని పరిస్థితి ఉన్నది. ఇదిలా ఉండగా, ఎంపిలు పార్టీని వీడితే ఆ ప్రభావం ఎంత ఉంటుందన్నది ఎన్నికలు నిర్ణయిస్తాయని జానారెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షపై తాజా స్థితిగతులను ఎప్పటికప్పుడు అధిష్టానానికి వివరిస్తున్నానన్నారాయన. 2014లోగానే తెలంగాణపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం తనకుందన్నారు జానారెడ్డి. ఏదేమైనా జానారెడ్డి మాటలను ఆ పార్టీ నేతలే విశ్వసించని పరిస్థితి నెలకొన్నది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు