టీడీపీ ఫ్యూచ‌ర్ ప్లాన్ ఏంటి... పార్టీపై బాబుకు ప‌ట్టు ఉంటుందా..!

టీడీపీ ఫ్యూచ‌ర్ ప్లాన్ ఏంటి...  పార్టీపై బాబుకు ప‌ట్టు ఉంటుందా..!

రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ ప్యూచ‌ర్ ప్లాన్ ఏంటి? పార్టీ అధినేత చంద్ర‌బాబు ఇప్పుడు ఏ దిశ‌గా ఆలోచ‌న చేస్తున్నారు? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నిక‌లు జరిగి, ఫ‌లితం వ‌చ్చి, కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటై.. దాదాపు నాలుగు మాసాలు పూర్త‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌రకు ప్ర‌తిప‌క్షంగా టీడీపీ అనుస‌రించిన విధానం ఏంటి? అని భేరీజు వేసుకుంటే.. జ‌గ‌న్ ప్ర‌బుత్వంపై ఎదురుదాడి త‌ప్ప మ‌రేమీ క‌నిపించ‌డం లేదు. ఎన్నిక‌ల‌కు ముందు సీఎం హోదాలో ఉన్న చంద్ర‌బాబు అప్ప‌టి విప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్ ను ఎలా దూషించారో.. ఇప్పుడు కూడా అదేవిధంగా దూషిస్తున్నారు.

అప్ప‌ట్లో ఎలా అయితే, క‌డప రౌడీలు, గుండాలు, ఆంబోతులు, రాక్ష‌సులు, అక్ర‌మాల పుట్ట‌లు అంటూ తిట్టారో.. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ వాటితోనే ప‌ల‌క‌రిస్తున్నారు. వాటినే మీడియా ముందుకూడా చెప్పుకొస్తున్నారు. దీంతో ప్ర‌జ‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ అభిప్రాయం ఉందో టీడీపీపై అదే భావ‌న కొన‌సాగుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. నిజానికి ఎన్నిక‌ల‌కు ముందు.. అనేక నివేదిక‌లు తెప్పించుకున్న చంద్ర‌బాబు.. ఇప్పుడు ఓడిపోయిన త‌ర్వాత ప్ర‌తిప‌క్షంగా ఏ పాత్ర పోషిస్తున్నాం.. ఎలా వ్య‌వ‌హ‌రించాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు? ఏయే అంశాల‌ను అజెండాగా పెట్టుకునిపోరు చేస్తే.. ప్ర‌జ‌ల్లో మంచి మార్కులు కొట్ట‌గ‌లం ..? అనే విష‌యాల‌ను ఆయ‌న ఏమాత్రం ప‌ట్టించుకోలేదు.

ఫ‌లితంగానే ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు అండ్ కోలు ఏ ఉద్య‌మాలు చేప‌ట్టినా.. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఏ విమ‌ర్శ‌లు చేసినా.. పెద్ద‌గా ప్ర‌జ‌ల్లోకి చేర‌లేదు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని ఆత్మ‌కూరు ద‌ళితుల ర‌గడ నుంచి అన్నా క్యాంటీన్ల వ‌ర‌కు ఏ విష‌యం కూడా పెద్ద‌గా ఫ‌లించ‌లేదు. అదే స‌మ‌యంలో గోదావ‌రి న‌దిలో ప‌డ‌వ మునిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి కూడా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌లేక పోయారు. ప‌రిహారం విష‌యంలోకానీ, బాధ్య‌త విష‌యంలో కానీ, జ‌గ‌న్ అప్ప‌టిక‌ప్పుడు స్పందించ‌డంతో ప్ర‌జ‌ల్లో ఈ ఘ‌ట‌న పెద్ద‌గా చ‌ర్చ‌కు రాలేదు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఫ్యూచ‌ర్ ప్లాన్ మార్చుకున్నార‌ని అంటున్నారు నాయ‌కులు. ఎక్కువ‌గా పార్టీ కార్య‌క్ర‌మాలు, పార్టీలో స‌మ‌న్వ‌యం, నాయ‌కుల‌ను క‌లుపుకొని పోయేందుకు త్వ‌ర‌లోనే ఓ మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధం చేసుకుని ముందుకు సాగాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్న‌ట్టు చెబుతున్నారు. మ‌రి ఇదైనా స‌క్సెస్ అవుతుందో లేదో ? చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English