విక్ర‌మ్ జాడ దొరికింది.. కాని ఏమైందంటే...

విక్ర‌మ్ జాడ దొరికింది.. కాని  ఏమైందంటే...

జాబిల్లిని అందుకోవాల‌ని భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ఇస్రో) ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చంద్ర‌యాన్ 2. అయితే చంద్రయాన్ 2 ప్ర‌యోగం దాదాపుగా విజ‌యం అంచుల‌దాకా చేరుకుని చివ‌రి నిమిషంలో కొంత ప్ర‌తికూల ప‌రిస్థితి నెల‌కొనడంతో విజ‌య‌వంతం కాలేక‌పోయింది. అయితే చంద్ర‌యాన్ 2లో చంద్రుడిపై దిగి అక్కడి ప‌రిస్థితుల‌ను అధ్య‌య‌నం చేసే విక్ర‌మ్ ల్యాండ‌ర్‌లో త‌లెత్తిన సాంకేతిక లోపంతో కేవ‌లం చంద్రుడికి రెండు కిలోమీట‌ర్ల దూరంలో అగిపోయింది. అస‌లు విక్ర‌మ్ ల్యాండ‌ర్ జాబిల్లిపై ల్యాండ్ అయిందా లేదా అని ఇంత‌కాలం సందిగ్ధం నెల‌కొంది.

అయితే భార‌త్ పంపిన విక్ర‌మ్ ల్యాండ‌ర్ జాడ‌ను నాసా దొర‌క‌బ‌ట్టింది. చంద్ర‌యాన్ 2 లోని విక్ర‌మ్ ల్యాండ‌ర్ ఫోటోలను నాసాకు చెందిన ఎల్ ఆర్ ఓ ( లూనార్ రెకోనైసెన్స్ ఆర్బిట‌ర్ ) తీసి నాసా కేంద్రానికి పంపింది. నాసా ఆ ఫోటోల‌ను ఇస్రోకు పంపిందని ఇస్రో చైర్మ‌న్ శివ‌న్ తెలిపారు. అయితే  ఆర్బిట‌ర్ విక్ర‌మ్ ల్యాండ‌ర్ ప్రాంతంలో రాత్రి స‌మ‌యంలో కావ‌డంతో అది తీసిన ఫోటోలు గుర్తించేందుకు వీలు కాకుండా ఉన్నాయి. అయితే విక్ర‌మ్ ల్యాండ‌ర్ లొకేష‌న్ ను ఈ ఫోటోల ద్వారా గుర్తించ‌గ‌లుగుతున్నారు కానీ, దాని పొజిష‌న్ ఎలా ఉందో గుర్తించ‌డం క‌ష్టంగా మారింది.

అందుకే ఎల్ ఆర్ ఓ మ‌రోమారు విక్ర‌మ్ ల్యాండ‌ర్ ల్యాండ్ అయిన ప్ర‌దేశం నుంచి  అక్టోబ‌ర్ 14న మ‌రోసారి వెళ్ళ‌నుంది.  అప్పుడు పగటి సమయం ఉండటం వల్ల‌ ల్యాండర్ స్థానాన్ని గుర్తించేందుకు పరిస్థితులు మరింత అనుకూలించనున్నాయని  ఆ ఆర్బిటర్‌ మిషన్‌కు చెందిన డిప్యూటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ జాన్ కెల్లర్ ఓ మెయిల్‌లో తెలిపారు. ఇస్రో జూలై 22న చంద్రయాన్ 2ను ప్రతిష్టాత్మకంగా ప్రయోగించింది.  అన్ని కక్ష్యల్లోనూ విజయవంతంగా దూసుకెళ్లిన చంద్రయాన్ 2 చంద్రుడి కక్ష్యకు మరో 2.1 కి.మీ దూరంలో ఉందనగా విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి.

అక్టోబ‌ర్ 14న  ఎల్ ఆర్ ఓ ప‌గలు వెళ్ళ‌నున్నందున్న ఆ రోజున ఆర్భిట‌ర్‌తో స్ప‌ష్ట‌మైన ఫోటోలు తీయ‌నున్నారు. అప్పుడు విక్ర‌మ్ ల్యాండ‌ర్ ఎలా ల్యాండ్ అయిందో తెలిసిపోతుంది. అప్పుడు దాన్ని విక్ర‌మ్ ల్యాండ‌ర్ ప‌రిస్థ‌తిని బ‌ట్టి ఏమి చేయాలో నిర్ణ‌యిస్తార‌ట‌. అప్ప‌టి దాకా ఇప్ప‌డు తీసిని ఫోటోల‌ను అధ్య‌య‌నం చేయ‌న‌న్నామ‌ని ఇస్రో చైర్మ‌న్ శివ‌న్ వెల్ల‌డించారు. నాసా చేస్తున్న ఈ కృషితో ఇస్రోలో ఆశ‌లు చిగురించాయి. అక్టోబ‌ర్ 14న ఎల్ ఆర్ ఓ తీసే ఫోటోల కోసం వేచి చూడక త‌ప్ప‌దు.. ఇప్పుడు నాసా ఇచ్చిన ఈ స‌మాచారంతో భార‌తీయుల్లో మ‌రోసారి చంద్ర‌యాన్ 2పై ఆశ‌లు చిగురించాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English