సీబీఐ ముందుకు మంత్రి బొత్స‌...

సీబీఐ ముందుకు మంత్రి బొత్స‌...

వోక్స్ వ్యాగన్ కేసులో సీబీఐ ఎదుట ఏపీ పుర‌పాల‌క శాఖ  మంత్రి బొత్స సత్యనారాయణ సాక్షిగా హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జర్మనీకి చెందిన వోక్స్ వ్యాగన్ కోసం వశిష్ణ వాహన్ అనే సంస్థకు రూ.11 కోట్లు చెల్లించిన కుంభకోణంలో బొత్స సత్యనారాయణ సాక్షిగా ఉన్నారు. అప్పట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణపై తీవ్ర ఆరోపణలు రావటంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారు.

ఈ కేసులో ఇప్పటివరకు 59 సాక్షులను విచారించింది. ఈ కేసులో నలుగురిపై సీబీఐ అభియోగాలు మోపింది. జైన్, అళగ రాజా, గాయత్రి, వశిష్ట వాహన్ సీఈవో సూష్టర్‌లపై కేసులు నమోదు చేసింది..

ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొద‌టిసారి సీఎంగా ఉన్న సమయంలో వోక్స్ వ్యాగ‌న్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో వోక్స్ వ్యాగ‌న్  రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపింది. విశాఖకు చెందిన కార్ల ఫ్యాక్టరీ స్థాపనకు వోక్స్ వ్యాగన్‌కు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వశిష్ట వాహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11 కోట్లు చెల్లించింది.

అయితే వశిష్ట వాహన్ సీఈవో సూష్టర్‌తో తమకు ఏ విధమైన సంబంధం లేదని వోక్స్ వ్యాగన్ ప్రకటించింది. దీంతో అప్పట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును సీబీఐకి అప్ప‌టి ముఖ్య‌మంత్రి హోదాలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి  అప్పగించారు. ఈ కేసు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ ప్ర‌కంప‌నాల‌ను సృష్టించింది. బొత్స స‌త్య‌నారాయ‌ణ పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌తో ఆనాడు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ఓ మాయ‌ని మ‌చ్చ ప‌డింది. బొత్స స‌త్య‌నారాయ‌ణ‌పై 2005లో  వోక్స్ వ్యాగన్ కుంభకోణంపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈకేసులో సీబీఐ మొత్తం 3 వేల పేజీలలో ఛార్జిషీటు దాఖలు చేసింది.

ఈ కేసుకు సంబంధించి 59 మంది సాక్షులను సీబీఐ అధికారులు విచారించారు. మొత్తం రూ. 12 కోట్లు కుంభకోణం జరిగినట్లు తన నివేదికలో వెల్లడించింది. కాగా ఇప్పటివరకూ రూ. 7 కోట్లు సీబీఐ అధికారులు రికవరీ చేశారు. మిగిలిన వాటి కోసం విచారణ చేపడుతున్నారు. అయితే ఈ కేసు ఇంకా పూర్తి కాక‌పోవ‌డంతో మంత్రి బొత్స విచార‌ణ‌కు రావాల‌ని సీబీఐ నోటీసులు పంపింది. దీంతో మంత్రి బొత్స మ‌రోమారు సీబీఐ ముందు ఓ సాక్షిగా హాజ‌ర‌య్యారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English