విక్ర‌మ్‌కు అస‌లు స‌మ‌స్య ఇదేనా!

 విక్ర‌మ్‌కు అస‌లు స‌మ‌స్య ఇదేనా!

జాబిల్లి పైకి మ‌న శాస్త్ర‌వేత్త‌లు పంపిన విక్ర‌మ్ ల్యాండ‌ర్‌లో ఐదో ఇంజ‌న్ తోనే అస‌లు స‌మ‌స్య వ‌చ్చింద‌ని ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. చంద్ర‌యాన్ 2 ప్ర‌యోగంతో చంద‌మామ‌ను అందుకోవాల‌ని, దానిపై మ‌నిషి మ‌నుగ‌డ‌, అక్క‌డ ఉన్న ప‌రిస్థితులు అధ్య‌యనం చేయాల‌ని చేసిన ప్ర‌యోగాలు స‌ఫ‌లం కాలేదు. దీంతో ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు అస‌లు చంద్ర‌యాన్ 2లో జ‌రిగిన లోపాలు, త‌లెత్తిన స‌మ‌స్య‌లను విశ్లేషించే ప‌నిలో ప‌డ్డారు. ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల అంచనా ప్ర‌కారం విక్ర‌మ్ ల్యాండ‌ర్‌లో ఏర్పాటు చేసిన ఐదో ఇంజ‌న్‌తోనే స‌మ‌స్య వ‌చ్చింద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు చేసిన చంద్ర‌యాన్ 2 ప్ర‌యోగంలో విక్ర‌మ్ ల్యాండ‌ర్ స‌క్ర‌మంగా ప‌నిచేయ‌క‌పోవ‌డానికి ప్ర‌ధానంగా ఐదో ఇంజ‌నే కార‌ణ‌మ‌ని నిర్ధార‌ణ‌కు రావ‌డంతో అస‌లు ఐదో ఇంజ‌న్ ఎక్కడుంది అనే ప్ర‌శ్న ఉద్భ‌వించింది. వాస్త‌వానికి  చంద్రుడిపై ప్రయోగాలు చేసేందుకు ప్రయోగించే వాహకనౌకలకు సింగిల్ ఇంజిన్ (3,500 న్యూటాన్ల సామర్థ్యం) సరిపోతుంద‌ట‌.

అయితే విక్ర‌మ్ ల్యాండ‌ర్‌లో ఐదు ఇంజ‌న్లు ఏర్పాటు చేశార‌ట‌. ముందుగా నాలుగు ఇంజ‌న్లే ఏర్పాటు చేసిన శాస్త్ర‌వేత్త‌లు, చివ‌రి నిమిషంలో మ‌రో ఇంజ‌న్‌ను చేర్చార‌ట‌. దీంతో లాండ‌ర్ బ‌రువు అమాంతం పెరిగిందట‌. చంద్రయాన్-2ను మొదట రెండు టన్నుల బరువు వరకు మోసుకెళ్లగల జీఎస్ఎల్వీ మార్క్-2 రాకెట్‌తో ప్రయోగించాలని అనుకున్నారు. అయితే, ఐదో ఇంజిన్‌ను చేర్చడం వల్ల వాహకనౌక బరువు పెరిగింది. దీంతో జీఎస్ఎల్వీ మార్క్-3ని వాడారు. చంద్రయాన్ 2 ప్ర‌యోగంలోనే  ఈ ఐదో ఇంజ‌న్‌తోనే భారీ మార్పులు చోటు చేసుకున్నాయ‌ట‌. వీటికి తోడు చివ‌రి నిమిషంలో చేసిన కొన్ని త‌ప్పిదాలు కూడా విక్ర‌మ్ ల్యాండ‌ర్ సక్ర‌మంగా జాబిల్లిపై లాండ్ కాలేక‌పోయింద‌ట‌.

ఏదైమైనా ఇది ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల విఫ‌లం అనే క‌న్నా ఓ కొత్త పాఠం నేర్చుకున్నార‌ని అనుకోవ‌చ్చు. ఈ చంద్ర‌యాన్ 2 ప్ర‌యోగంతో ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు అనేక కొత్త విష‌యాలు తెలుసుకున్నారు. ఇది రాబోవు రోజుల‌కు కొత్త ఆలోచ‌న‌ల‌తో, మ‌రిన్ని ప్ర‌యోగాల‌కు దిక్సూచిగా నిలుస్తుంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English