ఆ రెండు రోల్స్ చాలు.. ఆయ‌నెంతో గొప్ప న‌టుడో చెప్ప‌డానికి

ఆ రెండు రోల్స్ చాలు.. ఆయ‌నెంతో గొప్ప న‌టుడో చెప్ప‌డానికి

మాజీ ఎంపీ, తెలుగుదేశం సీనియ‌ర్ నాయకుడు ఎన్.శివ‌ప్ర‌సాద్ క‌న్నుమూయ‌డం చిత్తూరు జిల్లాలో ఆయ‌న అనుచ‌ర‌గ‌ణాన్ని , అభిమానుల్ని విషాదంలో ముంచెత్తింది. రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న ఎంత పాపుల‌రో చెప్పాల్సిన ప‌ని లేదు. స‌మ‌స్య‌ల మీద పోరాటంలో భాగంగా పార్ల‌మెంటు ముందు ఆయ‌న విచిత్ర వేష‌ధార‌ణ‌తో దేశ‌వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించారు.

ఈ వేషాలు చూసిన న‌వ్వుకున్న వాళ్లూ ఉన్నారు. ఐతే స్వ‌త‌హాగా న‌ట‌న అంటే శివ‌ప్ర‌సాద్‌కు ప్రాణం. రాజ‌కీయ నాయ‌కుడిగా కంటే న‌టుడిగా ఉండ‌టాన్ని ఆయ‌నెక్కువ ఇష్ట‌ప‌డ‌తార‌ని అంటారు. ఆయ‌న చేసిన సినిమాలు త‌క్కువే కానీ.. వాటిలో బ‌ల‌మైన ముద్రే వేశారు. ముఖ్యంగా శివ‌ప్ర‌సాద్ కెరీర్లో రెండు పాత్ర‌లు చిరస్థాయిగా నిలిచిపోయేవి. ఆ పాత్ర‌లు ఆయ‌నెంత గొప్ప న‌టుడో చాటి చెబుతాయి.

కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన డేంజ‌ర్ సినిమాలో గ‌ట్ట‌య్య అనే రాజ‌కీయ నాయ‌కుడి పాత్ర పోషించారు శివ‌ప్ర‌సాద్. ఆ సినిమా రావ‌డానికి ముందు వైఎస్ కేబినెట్లో భారీ పరిశ్ర‌మ‌ల శాఖా మంత్రిగా చేసి అప్ర‌తిష్ట మూట‌గ‌ట్టుకున్న బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను టార్గెట్ చేస్తూ కృష్ణ‌వంశీ ఈ పాత్ర డిజైన్ చేశాడు.

భ‌యం గొలిపే గ‌ట్ట‌య్య పాత్ర‌లో శివ‌ప్ర‌సాద్ అభిన‌యం గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. ముఖ్యంగా క్లైమాక్సులో ఆయ‌న న‌ట‌న అసామాన్యం. ఇక నితిన్ న‌టించిన ఆటాడిస్తా సినిమాలో విల‌న్ పాత్రలోనూ శివ‌ప్ర‌సాద్ చెలరేగిపోయారు. బాడీ లాంగ్వేజ్, మేన‌రిజ‌మ్స్, డైలాగ్ డెలివ‌రీ విష‌యంలో ఎంతో వైవిధ్యం క‌నిపించే ఆ పాత్ర‌లో శివ‌ప్ర‌సాద్ త‌న‌దైన ముద్ర వేశాడు. న‌న్ను కొట్లా అంటూ ఆయ‌న చెప్పే డైలాగ్ సూప‌ర్ పాపుల‌రైంది. ఈ రెండు సినిమాలూ హిట్ట‌యి ఉంటే న‌టుడిగా శివ ప్ర‌సాద్ కెరీరే వేరుగా ఉండేదే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English