బీజేపీపై కేటీఆర్ ఎటాక్‌...

బీజేపీపై కేటీఆర్ ఎటాక్‌...

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్  క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు  బీజేపీ నేతలపై విరుచుకుప‌డ్డారు. శ‌నివారం కేటీఆర్  మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ‌లో అస‌లు బీజేపీ లేదన్న విషయం దేశమంతా తెలుసని,  ఏదో  బీజేపీ నేతలు దారితప్పి నాలుగు ఎంపీ సీట్లు గెలిచి తెగ హడావిడి చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బీజేపీ కేవ‌లం ప‌ట్ట‌ణ పార్టీగానే తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తెలుసుని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో  ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమ‌లు  చేస్తున్నారా ? అని బీజేపీ నేత‌ల‌ను కేటీఆర్ ప్ర‌శ్నించారు.

అస‌లు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాలు అమలు చేయ‌డంతో పూర్తిగా విఫ‌ల‌మ‌యినార‌న్న విష‌యం తెలంగాణ బీజేపీ నేతలకు తెలియ‌ద‌ని, కావాలంటే బీజేపీ నేత‌లు వారి పాలిత రాష్ట్రాల్లో ప‌ర్య‌టించి అధ్య‌య‌నం చేయాల‌ని హితువు ప‌లికారు. బీజేపీ రాజ‌కీయాలు, బీజేపీ నేత‌లు చేసే  రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో నడవవని చురకలంటించారు.

కేసీఆర్ త‌ప్పు చేశాడు తప్పు చేశాడ‌ని కేవ‌లం మీడియా ముందు ఊద‌ర‌గొట్ట‌డ‌మే కానీ ఇంత‌వ‌ర‌కు ఒక్క త‌ప్పైనా చూపారా ? అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ త‌ప్పు చేస్తే   వైఎస్, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య లాంటి మహామహులు  వదిలిపెట్టి ఉండేవాళ్లా  అంటూ కేటీఆర్  ప్రశ్నించారు. తెలంగాణ ఉద్య‌మంలో కాక‌లుతీరిన నేత‌ల‌ను కూడా లెక్క‌చేయ‌లేద‌ని, ఇప్పుడు బీజేపీకి ఉన్న బ‌ల‌మెంత‌.. బ‌ల‌గ‌మెంత‌.. వారు చేసేందేంది అంటూ ఆయ‌న విరుచుకుప‌డ్డారు.

అయితే  కొద్దిరోజుల నుంచి కేసీఆర్ ఎందుకు కరీంనగర్‌కే అన్ని మంత్రి పదవులు కేటాయించారని బీజేపీ నేత‌లు హడావిడి చేస్తున్నారని అస‌లు తెలంగాణ ఉద్య‌మానికి పురుడుపోసిన నేల క‌రీంన‌గ‌ర్ అన్న విష‌యం మ‌ర్చిపోరాద‌ని అన్నారు. కరీంనగర్‌ జిల్లా అంటే.. సీఎం కేసీఆర్‌కు ఇష్టం, అందుకే ఆ ఒక్క జిల్లాకే నాలుగు మంత్రి పదవులు ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా తెలంగాణ ఉద్య‌మానికి ఖిల్లా అని కేటీఆర్ గుర్తు చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English