టీటీడీ మెంబర్లలో ఎవరెవరిని ఎవరెవరు సిఫార్సు చేశారో తెలుసా?

టీటీడీ మెంబర్లలో ఎవరెవరిని ఎవరెవరు సిఫార్సు చేశారో తెలుసా?

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల నియామకం వైసీపీలో అసంతృప్తికి దారితీస్తోంది. అయితే, ఇలా దేశవ్యాప్తంగా ఎవరెవరినో బోర్డులో సభ్యులుగా నియమించి రాష్ట్రానికి చెందిన వైసీపీ నేతలకు మొండి చేయి చూపిస్తే ఇబ్బంది వస్తుందని జగన్‌కు తెలియదా అన్న సందేహం కలగొచ్చు. జగన్ కూడా ఇలాంటి పరిస్థితిని ఊహించే ఉండొచ్చు.. కానీ, ఆయనపై ఉన్న ఒత్తిళ్ల కారణంగా అలా చేశారని రాజకీయవర్గాల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలు, ఇతరులు సిఫార్సుల మేరకు వీరిలో ఎక్కువ మందిని నియమించినట్లుగా చెబుతున్నారు.

కృష్ణమూర్తి వైద్యనాథన్ అనే సభ్యుడిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సిఫార్సు మేరకు నియమించారట. అమిత్ షా చెప్పాక జగన్ సార్‌కి తప్పుతుందా? అందుకే ఆ సిపార్సుకు ఓకే అన్నారు. ఇక తమిళనాడుకే చెందిన మరో సభ్యురాలు నిచిత ముప్పవరను డీఎంకే అధినేత స్టాలిన్ చెప్పడంతో నియమించారట.

నాదెండ్ల సుబ్బారావు అనే సభ్యుడికి స్వామీ స్వరూపానందేంద్ర సిపార్సు, డీపీ అనంతకు నిర్మలా సీతారామన్ సిపార్సు ఉంది. ముంబయికి చెందిన రాజేశ్ శర్మను ఓ న్యాయమూర్తి సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు. గోవింద హరిని  సుబ్రహ్మణ్య స్వామి, రమేశ్ షెట్టిని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సిఫార్సు చేశారు.

మూరంశెట్టి రాములు, యూ వెంకటభాస్కరరావులకు తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు, దామోదరరావుకు కేటీఆర్ మద్దతు, కుపేందర్ రెడ్డిని దేవెగౌడ సిఫారసు చేయగా.. ఎంఎస్ శివశంకరన్ను దిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఓ ఆధ్యాత్మిక వ్యక్తి సిపారసు చేసినట్లు చెబుతున్నారు.

అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, కేసీఆర్, కేటీఆర్, స్వామీజీలు సిపారసు చేయడంతో ఎవరినీ కాదనలేక సొంత పార్టీ వారిని పక్కనపెట్టి జగన్ పొరుగు రాష్ట్రాలవారితో టీటీడీని నింపేసినట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English