జగన్‌ను ఫాలో అవుతున్న కాంగ్రెస్ సీఎం

జగన్‌ను ఫాలో అవుతున్న కాంగ్రెస్ సీఎం

వైఎస్ జగన్ తన 100 రోజుల పాలనలోని మెరుపుల్లో కీలకమైనది పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న నిర్ణయమని చెబుతారు. ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్ర సీఎం ఒకరు తమ రాష్ట్రంలో అమలు చేయడానికి రెడీ అవుతున్నారు. అవును... రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ ఆ రాష్ట్రంలో ప్రయవేటు రంగంలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రణాళికులు రూపొందిస్తున్నారు.

ఆ రాష్ట్రంలోని పెద్ద పరిశ్రమలకు ప్రభుత్వం ఆర్థికపరమైన ప్యాకేజీల రూపంలో లబ్ధి కలిగిస్తున్నందున ఉద్యోగాల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని భావిస్తున్నది. పబ్లిక్‌ ప్రయివేటు పార్టనర్‌షిప్‌ (పిపిపి), చిన్న తరహా పరిశ్రలు మొదలైన వాటిలో స్థానికులకు ఉద్యోగాలను కల్పించే విధంగా పథకాలను రూపొందిస్తున్నది. ఇతర రాష్ట్రాలు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నప్పుడు రాష్ట్ర యువత కోసం తామెందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ప్రసాది లాల్‌ మీనా అన్నారు.

కాగా జగన్ అంటే మండిపడే సోనియా, రాహుల్ గాంధీలకు అశోక్ గెహ్లాత్ అత్యంత దగ్గరగా ఉండేనేత. మొన్నటి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత అక్కడ సచిన్ పైలట్ సీఎం సీటు కోసం ప్రయత్నించినా రాహుల్, సోనియాలు గహ్లోత్‌కే పట్టం కట్టారు. అలాంటి గహ్లోత్ ఇప్పుడు రాహుల్, సోనియాలకు ఏమాత్రం నచ్చని జగన్ ఆలోచనను కాపీ కొట్టడం.. అమలు చేయడాన్ని ఎలా స్వీకరిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English