వైసీపీ నేతల పుండుపై కారం జల్లుతున్న జగన్

వైసీపీ నేతల పుండుపై కారం జల్లుతున్న జగన్

పార్టీలో ఎంత అసంతృప్తి వచ్చినా లెక్క చేయకుండా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. అస్మదీయులు ఎక్కడున్నా పిలిచి పెద్దపీట వేస్తున్నారు. పార్టీ జెండాలు మోసి, పాదయాత్ర లో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టిన నేతలను మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇప్పటికే 24 మందిని టీటీడీ బోర్డులో నియమించగా అందులో కేవలం 8 మంది మాత్రమే ఆంధ్రప్రదేశ్ వారున్నారని పార్టీలో గగ్గోలు పెడుతున్నారు.

ఆ అసంతృప్తి అలాగే ఉండగా జగన్ పార్టీ నేతలకు మరో షాకిచ్చారు. టీటీడీ పాలకమండలిలో ప్రత్యేక అతిథులుగా మరో ఏడుగురికి చాన్సిచ్చారు. అందులో ఒక్కరు మినహా మిగతా వారంతా ఇతర రాష్ట్రాలవారే కావడంతో ఏపీ వైసీపీ నేతలకు పుండు మీద కారం చల్లినట్లు అవుతోంది. పైగా తాజా నియామకాల్లో చెన్నైకి చెందిన శేఖరరెడ్డి ఉండడం రచ్చకు దారితీస్తోంది. శేఖరరెడ్డి చంద్రబాబు హయాంలోనూ టీటీడీ సభ్యుడిగా ఉన్నారు.. ఆయన ఇంటిపై ఐటీ దాడులు జరగడంతో ఆయన సబ్యత్వం కోల్పోయారు. అలాంటి వివాదాస్పదుడికి జగన్ ఇప్పుడు ప్రత్యేక అతిథిగా టీటీడీలోకి తెచ్చారు.

గతంలో పాలకమండలిలో 16 మంది సభ్యులు ఉండగా ఈ సంఖ్యను ప్రభుత్వం ఇటీవల 25మందికి పెంచిన సంగతి తెలిసిందే. వీరితో పాటు దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ ఈవో, దేవదాయ శాఖ కమిషనర్‌, తుడా చైర్మన్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఉంటారు. ఇక వీరికి తోడు ఇప్పుడు ప్రత్యేక ఆహ్వానితులుగా మరో ఏడుగురికి కూడా అవకాశం కల్పించింది.

ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, రాకేష్ సిన్హా (ఢిల్లీ), శేఖర్ (చెన్నై), కుపేందర్ రెడ్డి (బెంగళూరు), గోవిందహరి (హైదరాబాద్), దుష్మంత్ కుమార్ దాస్ (భువనేశ్వర్), అమోల్ కాలే (ముంబై)లను నియమించింది. వీరికి కూడా పాలకమండలి సభ్యులతో సమానంగా ప్రోటోకాల్ ఉండనుండగా పాలకమండలి నిర్ణయాలలో మాత్రం ఓటుహక్కు ఉండదు. తాజాగా నియమించిన ఏడుగురిలో భూమన ఒక్కరే ఏపీకి చెందినవారు. గోవింద హరి తెలంగాణవాసి.. మిగతావారంతా ఇతర రాష్ట్రాలవారే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English