మాటైనా చెప్పలేదు.. ఇప్పుడు మామ అంటావా?

మాటైనా చెప్పలేదు.. ఇప్పుడు మామ అంటావా?

రాజకీయాలు వేరు.. వ్యక్తిగత సంబంధాలు వేరన్నట్లు కొందరు మాట్లాడుతుంటారు. వ్యక్తిగత అనుబంధాల ఆధారంగా రాజకీయంగా ఎదిగే ప్రయత్నం చేసిన ఒక నేతకు ఊహించని రీతిలో ఎదురైన షాక్ అందరిని ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు.. హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు పలువురిని ఆకర్షిస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ లాబీల్లోని సోఫాల్లో సీఎల్పీ నేత భట్టి.. పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. శ్రీధర్ బాబు.. పోదెం వీరయ్య.. సీతక్కలు కూర్చొని ఉన్నారు. అటువైపుగా వెళుతున్న ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డిని చూసి ఆగారు.

భట్టితో మాట్లాడారు. వీరి మధ్య మాటలు సంవాదంగా మారాయి. ఆ సందర్భంగా రాజ్ గోపాల్ రెడ్డికి కందాళ వివరణ ఇస్తూ.. మామ అంటూ సంబోధించారు. అంతే.. అప్పటివరకూ మామూలుగా ఉన్న రాజ్ గోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎవరు నీకు మామ.. ఎంతో కష్టపడి పార్టీ టికెట్ ఇప్పించి.. గెలిపిస్తే మాట వరసకు కూడా చెప్పకుండా టీఆర్ఎస్ లో వెళ్లిపోయావు. ఎవరు నీకు మామ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊహించని ఈ పరిణామంతో కందాళ ఒక్కసారి అవాక్కు అయ్యారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English