కాంగ్రెస్‌, బీజేపీల‌కు ఒక్క దెబ్బ‌తో మైండ్ బ్లాక్ చేసిన కేసీఆర్‌

కాంగ్రెస్‌, బీజేపీల‌కు ఒక్క దెబ్బ‌తో మైండ్ బ్లాక్ చేసిన కేసీఆర్‌

ప్ర‌త్య‌ర్థుల ఎత్తుగ‌డ‌ల‌ను చిత్తు చేయ‌డంలో గులాబీ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంథానే వేరు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ ఆవిర్భ‌వించిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న చేతిలో ఎంద‌రో హేమాహేమీలు మ‌ట్టిక‌రిచారు. ఇక తాజా విష‌యానికి వ‌స్తే.. కాంగ్రెస్‌, బీజేపీల‌కు కేసీఆర్ భారీ షాక్ ఇచ్చారు. ఊహించ‌ని విధంగా గులాబీ బాస్ స్పందించ‌డంతో అయ్య‌య్యో.. క‌థ అడ్డం తిరిగిందేమిటీ..? అంటూ ఆయా పార్టీల నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

కొద్ది రోజులుగా న‌ల్ల‌మ‌ల‌లో యురేనియం త‌వ్వ‌కాలు జ‌రుపొద్దంటూ సామాన్య జ‌నంతోపాటు సెల‌బ్రిటీలు సేవ్ న‌ల్ల‌మ‌ల పేరుతో స్పందిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ మ‌రో అడుగుముందుకేసి.. ఓ క‌మిటీని కూడా వేసింది. సేవ్ న‌ల్ల‌మ‌ల పేరుతో ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లాల‌ని ఆ పార్టీ భావించింది. యురేనియం త‌వ్వ‌కాల‌కు వ్య‌తిరేకంగా పోరాడాల‌ని పిలుపునిచ్చింది. అయితే.. ఇదే రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఈ అంశంతో ఇరుకున‌పెట్ట‌వ‌చ్చున‌ని ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ.. ప్ర‌స్తుతం సీన్ రివ‌ర్స్ అయింది.

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు అనుమతిచ్చేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఎవరికీ ఏవిధమైన అనుమతిని ఇవ్వలేదని, భవిష్యత్తులో కూడా యురేనియం తవ్వకాలకు అనుమతులిచ్చే ఆలోచన తమకు లేదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఆదివారం అసెంబ్లీలో సాధారణ చర్చ సందర్భంగా యురేనియం తవ్వకాలపై సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో నల్లమల అడవులను నాశనం కానివ్వబోమని ఆయ‌న‌ పేర్కొన్నారు.

2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వొద్దని చెప్తే కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు జారీచేసిందని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇక బీజేపీకి కూడా కేసీఆర్ త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా తెలంగాణ‌లో పాగా వేయాల‌ని చూస్తున్న బీజేపీ అందుకుత‌గ్గ‌ట్టుగానే వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబ‌ర్ 17ను తెలంగాణ విమోచ‌న దినంగా పాటించాల‌ని డిమాండ్ చేస్తోంది. జాతీయ జెండాలు ఎగురువేయాల‌ని పిలుపునిస్తోంది. ఈ అంశంతో రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌ని చూసింది.

ఈ క్ర‌మంలోనే పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షాను హైద‌రాబాద్‌కు తీసుకువ‌చ్చి హ‌డావుడి చేయాల‌ని చూస్తోంది. కానీ.. కేసీఆర్ ఇచ్చిన స‌మాధానంతో క‌మ‌ల‌ద‌ళం ప్లాన్ కూడా బెడిసికొట్టింది. 17వ తేదీన స్వ‌యంగా తెలంగాణ భ‌వ‌న్‌పైనే జాతీయ జెండా ఎగుర‌వేస్తామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. దీంతో క‌మ‌ల‌ద‌ళానికి గ‌ట్టి షాక్ త‌గ‌లిన‌ట్టు అయింది. ఇలా త‌మ ఎత్తుకు పై ఎత్తు వేసి ఊహించ‌ని రీతిలో షాక్ ఇచ్చిన కేసీఆర్‌ను కాంగ్రెస్‌, బీజేపీలు ముందుముందు ఎలా ఎదుర్కొంటాయో ? చూడాలి మ‌రి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English