ఇండియా కంటే పాకిస్తాన్ ఎంతో బాగుందంటున్న కాంగ్రెస్ మిత్రుడు

ఇండియా కంటే పాకిస్తాన్ ఎంతో బాగుందంటున్న కాంగ్రెస్ మిత్రుడు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌‌కు పాకిస్తాన్ చాలా బాగా నచ్చేసిందట. పాకిస్తాన్‌ను, ఆ దేశ ప్రజలను ఆయన తెగ పొగిడేస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్ వెళ్లొచ్చిన ఆయన అక్కడి అనుభవాలను పంచుకుంటూ భారత్ కంటే పాక్ బెటరని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. అంతేకాదు.. ఇక్కడ బీజేపీ చెబుతున్నలాంటి పరిస్థితులేమీ పాకిస్తాన్లో లేవని పవార్ పాకిస్తాన్‌కు క్లీన్ చిట్ ఇస్తున్నారు.

బీసీసీఐ కమిటీల్లో తాను ఉన్నప్పుడు అనేక సార్లు టీమిండియాతో పాక్ వెళ్లానని, అక్కడ ప్రజలు ఆత్మీయంగా స్వాగతం పలికారని ఆయన చెప్పుకొచ్చారు. భారతీయుల పట్ల పాకిస్తాన్‌ పౌరులు ఆత్మీయత చూపుతారంటూ వారిపై ప్రశంసలు గుప్పించారు. ఆదివారం ముంబైలోని పార్టీ కార్యాలయంలో మైనార్టీల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవార్‌ ఈ వ్యా ఖ్య లు చేశారు.   పాకిస్తాన్‌కు ఎప్పుడు వెళ్లినా అక్కడి ప్రజలు మంచి ఆతిథ్యాన్ని అందించారని పేర్కొన్నారు.

పాకిస్తానీయులు భారత్‌లో వారి బంధు వులను కలిసే వీలులేక అక్కడికి వచ్చే వారినే బంధువులుగా భావించి సకల మర్యా దలు చేస్తారని కొనియాడారు. పాకిస్తాన్‌లో ప్రజలు సంతోషంగా లేరని, సరైన న్యాయం లభించదన్న వార్తల్లో నిజం లేదని అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్‌పై విష ప్రచారం చేపడుతోందని విమర్శించారు.

అయితే... పవార్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడ్డారు. ఆయనపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దీంతో ఆయన ఆ తరువాత వివరణ ఇచ్చుకున్నారు. తానేమీ పాకిస్తాన్‌ను పొగడలేదని.. బీజేపీని విమర్శించలేదని.. కేవలం పాక్‌లో పరిస్థితులను మాత్రమే చెప్పానని అన్నారు.

కాగా పవార్ బీజేపీపై మండిపడుతూ పాక్‌ను తలకెత్తుకోవడానికి కారణాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. శనివారం ఎన్సీపీ సీనియర్ లీడర్, సతారా ఎంపీ అయిన ఉదయన్ రాజె భోంస్లే ఎన్సీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఆయన ఛత్రపతి శివాజీ వంశానికి చెందినవారు. సతారా, మరికొన్ని నియోజకవర్గాల్లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మహారాష్ట్రలో గత ఎన్నికల కంటే బీజేపీ మరింత బలపడిన పరిస్థితుల్లో తన పార్టీ నుంచి సీనియర్లు బీజేపీలోకి వెళ్లిపోతున్నారన్న ఆక్రోశంతో పవార్ ఇలాంటి వ్యాఖ్యలు చేసుండొచ్చని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English