కేసీఆర్‌కు అగ్నిప‌రీక్షే... గెలిచి నిలిచేనా..!

కేసీఆర్‌కు అగ్నిప‌రీక్షే... గెలిచి నిలిచేనా..!

తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నికకు రంగం సిద్ధ‌మైంది. సూర్యాపేట జిల్లా (ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ‌) హుజూర్‌న‌గ‌ర్ అసెంబ్లీ  నియోజ‌క వర్గానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌బోతోంది. దీంతో ప్ర‌ధాన పార్టీలన్నీ బ‌రిలో దిగేందుకు సిద్ధ‌మ‌వు తున్నాయి. పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి  త‌న భార్య ప‌ద్మావ‌తిరెడ్డి పోటీ చేస్తార‌ని ప్రక‌టించారు. దీంతో అధికార పార్టీనుంచి ఎవ‌రు పోటీ చేస్తార‌నే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. అయితే ఈ ఉప ఎన్నిక అధికార‌ టీఆర్ ఎస్‌కు మాత్రం అగ్ని ప‌రీక్ష‌గా మార‌నుంది. ఇటీవ‌ల పార్టీ గ్రాఫ్ ప‌డిపోతోంద‌న్న ప్ర‌చారం జ‌రు గుతున్న నేప‌థ్యంలో ఈ ఎన్నిక అత్యంత కీల‌కం కానుంది.

పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఆయ‌న న‌ల్గొండ ఎంపీగా విజ‌యం సాధించారు. దీంతో ఆయన త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆయ‌న రాజీనామా చేసి దాదాపు మూడు నెల‌లు దాటింది. మ‌రో మూడు నెలల్లో హుజూర్‌న‌గ‌ర్‌కు ఉప ఎన్నిక నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సొంత నియోజ‌క‌వ‌ర్గం హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి  త‌న భార్య ప‌ద్మావ‌తిరెడ్డి పోటీ చేస్తార‌ని ఉత్త‌మ్ ప్ర‌క‌టించారు.

2018 ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ ఊహించ‌ని విధంగా రాష్ట్రంలో మెజారిటీ స్థానాల‌ను ద‌క్కించుకుని, రెండో సారి అధికారాన్ని కైవ‌సం చేసుకుంది. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, బీజేపీల‌కు చెందిన హేమాహేమీ నాయ‌కులంతా ఓట‌మిపాల‌య్యారు. అయితే ఆ త‌ర్వాత వ‌చ్చిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో సీన్ రివ‌ర్స్ అయింది. ఈ ఫ‌లితాలు అధికార పార్టీకి షాక్ ఇచ్చాయి. ప‌ద‌హారు స్థానాలు ద‌క్కించుకుంటామ‌ని ఢంకా బ‌జాయించిన ఆపార్టీ తొమ్మిది స్థానాల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఈ ఎన్నిక‌ల్లో అనూహ్యంగా బీజేపీ నాలుగు చోట్ల విజ‌యం సాధించ‌గా, కాంగ్రెస్ మూడు సీట్లు గెలుపొందింది. ఎంఐఎం ఒక్క‌చోట విజ‌యం సాధించింది.

ఇటీవ‌ల సీఎం కేసీఆర్ చేప‌ట్టిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ పార్టీలో దుమారం రేపింది. కొత్త‌గా పార్టీలోకి వ‌చ్చిన వారికి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టి, సీనియ‌ర్ల‌ను విస్మ‌రించార‌ని ప‌లువురు నేత‌లు బ‌హిరంగంగానే త‌మ అసంతృప్తిని వెల్ల‌గ‌క్కారు. అంతేగాక గులాబీ జెండాకు తాము కూడా ఓన‌ర్ల‌మే నంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి , పార్టీలో క‌ల‌క‌లం రేపారు. మ‌రోప‌క్క ప‌లువురు ఎమ్మెల్యేలు అధిష్టానంపై తిరుగ‌బాటు చేసి, పార్టీ మారుతార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఇక టీఆర్ ఎస్‌లో రాజ‌కీయ సంక్షోభం మొ ద‌లైంద‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఈక్ర‌మంలోనే వ‌స్తున్న హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక టీఆర్ఎ స్‌కు ప్ర‌తిష్టాత్మంకంగా మార‌నుంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English