రాజ‌కీయాల్లో ఇది ప‌వ‌న్ సాధించిన అతి పెద్ద విజ‌యం

రాజ‌కీయాల్లో ఇది ప‌వ‌న్ సాధించిన అతి పెద్ద విజ‌యం

రాజ‌కీయాల్లో ప్ర‌తిదీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే చేస్తుంటారు. నిజంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద చిత్త‌శుద్ధితో పోరాడే నాయ‌కులు క‌ర‌వైపోయారు. ఏదైనా స‌మ‌స్య‌ను టేక‌ప్ చేసినా అది త‌మ, పార్టీ ప్ర‌యోజ‌నాల‌కు ఏమేర‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చూసేవాళ్లే కానీ.. నిజంగా ప్ర‌జ‌ల బాధ‌లు తీర్చాల‌ని ప్ర‌య‌త్నించేవాళ్లు అరుదైపోయారు.

ఇలాంటి స‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌ల్ల‌మ‌లలో యురేనియం తవ్వ‌కాల మీద స్పందించిన తీరు.. పోరాడుతున్న వైనం ప్ర‌శంస‌లందుకుంటోంది. నిజానికి ఇది ప్ర‌ధానంగా తెలంగాణ ప్ర‌జానీకం స‌మ‌స్య‌. యురేనియం త‌వ్వ‌కాల కార‌ణంగా ఏపీ ప్ర‌జ‌లు కూడా ఇబ్బంది ప‌డతారు కానీ.. ఎక్కువ న‌ష్ట‌పోయేది తెలంగాణ వాళ్లే. న‌ష్టం ఎంత అయిన‌ప్ప‌టికీ.. అస‌లు ఏపీ నాయ‌కుల‌కు యురేనియం స‌మ‌స్య అస‌లేమీ ప‌ట్ట‌ట్లేదు.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ వ్య‌వ‌హారంతో త‌న‌కేం సంబంధం అన్న‌ట్లు ఉంటున్నారు. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు సైతం మౌనం వ‌హిస్తుండ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. ఇలాంటి స‌మ‌యంలో ప‌వ‌న్ నిజాయితీగా యురేనియం ఇష్యూ మీద స్పందించిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంది. గ‌తంలో ఇలాంటి కొన్ని స‌మ‌స్య‌ల మీద ముందు స్పందించి.. ఆ త‌ర్వాత మిన్న‌కుండిపోయేవాడు ప‌వ‌న్. కానీ ఈ ఇష్యూలో మాత్రం ప‌ట్టుద‌ల‌తో, ఒక అజెండాతో ముందుకు సాగుతున్నాడు.

ఈ క్ర‌మంలోనే ప్ర‌జా సంఘాలు, రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో జ‌న‌సేన త‌ర‌ఫున అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించ‌డం, అంద‌రి అభిప్రాయాలు సేక‌రించి కార్యాచ‌ర‌ణ‌కు న‌డుం బిగించ‌డం విశేషం. ఇలా తెలంగాణ‌లో ఓ స‌మ‌స్య మీద అంద‌రూ ఏక‌తాటి పైకి వ‌చ్చి పోరాటానికి సిద్ధం కావడం గ‌త కొన్నేళ్ల‌లో చూడ‌లేదు. ఇక్క‌డ త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు ఎంత అని చూడ‌కుండా ప‌వ‌న్ చిత్త‌శుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం ప్ర‌శంస‌నీయం. రాజ‌కీయ నాయ‌కుడిగా ప‌వ‌న్ సాదించిన అతి పెద్ద విజ‌యాల్లో ఒక‌టిగా దీన్ని చెప్పొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English